PM Modi: ప్రపంచకప్ విజేతను అభినందించిన ప్రధాని మోదీ.. ఫుట్‌బాల్ క్రీడాభిమానులను ఫ్రాన్స్ అలరించిందంటూ ట్వీట్..

|

Dec 19, 2022 | 8:49 AM

ఖతర్ వేదికగా లూసెయిల్ స్టేడియంలో జరిగిన ఫీఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా గెలవడంతో ఆ జట్టుపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా..

PM Modi: ప్రపంచకప్ విజేతను అభినందించిన ప్రధాని మోదీ.. ఫుట్‌బాల్ క్రీడాభిమానులను ఫ్రాన్స్ అలరించిందంటూ ట్వీట్..
Pm Modi Congratulates Argentina Team
Follow us on

ఆదివారం జరిగిన ఫీఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా 42 తేడాతో విజయం సాధించి టైటిల్ విజేతగా అవతరించింది. ఖతర్ వేదికగా లూసెయిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా గెలవడంతో ఆ జట్టుపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా అర్జెంటీనా టీమ్‌ సాధించిన విజయంపై ఆ జట్టును అభినందించారు. అలాగే టోర్నీ రన్నరప్‌గా నిలిచిన 2018 ప్రపంచకప్ విజేత ఫ్రాన్స్‌కు కూడా మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం రాత్రి రెండు ట్వీట్లు చేశారు. ప్రధాని మోదీ తన మొదటి ట్వీట్‌లో ప్రపంచకప్ విజేతగా నిలిచిన అర్జెంటీనా గురించి రాసుకొచ్చారు.

‘‘ ఈ ఫైనల్ అత్యంత ఉత్కంఠభరితమైన ఫుట్‌బాల్  మ్యాచ్‌లలో ఒకటిగా గుర్తుండిపోతుంది. ఫిఫా ప్రపంచకప్ విజేతగా అవతరించిన అర్జెంటీనాకు అభినందనలు. టోర్నమెంట్ ప్రారంభం నుంచి అద్భుతంగా రాణించారు. ఈ విజయం సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్న మెస్సీ, అర్జెంటీనా అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు’’ అని మోదీ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ ఫీఫా ప్రపంచకప్ 2022 ఫైనల్‌లో పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనా జట్టు 4-2తో ఫ్రాన్స్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. తద్వారా ఆ టీమ్ మూడో సారీ ఈ ట్రోఫీని కైవసం చేసుకున్నట్లయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..