AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK : భారత్ వర్సెస్ పాక్.. రోహిత్, కోహ్లీ లేని లోటు కనిపిస్తుందా? సూర్య సేన ముందు కొత్త సవాల్

IND vs PAK : టీ20 ప్రపంచకప్ 2026లో అసలైన అసలు సిసలైన సమరం వచ్చేసింది. ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియం వేదికగా భారత్ పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. గ్రూప్-Aలో జరగనున్న ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా సూపర్-8కు చేరుకుంటుంది. అయితే, ఈసారి మ్యాచ్ చాలా ప్రత్యేకం.

IND vs PAK : భారత్ వర్సెస్ పాక్.. రోహిత్, కోహ్లీ లేని లోటు కనిపిస్తుందా? సూర్య సేన ముందు కొత్త సవాల్
Team India
Rakesh
|

Updated on: Feb 14, 2026 | 9:20 AM

Share

IND vs PAK : టీ20 ప్రపంచకప్ 2026లో అసలైన అసలు సిసలైన సమరం వచ్చేసింది. ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియం వేదికగా భారత్ పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. గ్రూప్-Aలో జరగనున్న ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా సూపర్-8కు చేరుకుంటుంది. అయితే, ఈసారి మ్యాచ్ చాలా ప్రత్యేకం. దశాబ్ద కాలంగా జట్టును నడిపించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు లేకుండానే టీమిండియా పాకిస్థాన్‌తో తలపడుతోంది. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో సరికొత్త యువ భారతం దాయాదులకు చుక్కలు చూపించేందుకు సిద్ధమైంది.

ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో రెండు జట్లకు చెందిన మొత్తం 15 మంది ఆటగాళ్లు సరికొత్త అనుభవాన్ని రుచిచూడనున్నారు. ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్ వేదికపై భారత్-పాక్ పోరులో పాలుపంచుకోని యువ ఆటగాళ్లు ఈసారి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. భారత్ తరపున అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్ తొలిసారి ఈ మెగా పోరులో అరంగేట్రం చేయబోతున్నారు. వీరంతా ఇప్పటికే ఐపీఎల్, ద్వైపాక్షిక సిరీస్‌లలో సత్తా చాటిన వారే కావడంతో, పాక్ బౌలర్లకు దడ పుట్టించడం ఖాయం.

కేవలం టీమిండియాలోనే కాదు, పాకిస్థాన్ జట్టులో కూడా చాలా మంది కొత్త ఆటగాళ్లు భారత్‌తో పోరుకు సిద్ధమవుతున్నారు. పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాకు కూడా టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌పై ఆడిన అనుభవం లేదు. అతనితో పాటు సాహిబ్జాదా ఫర్హాన్, సామ్ అయూబ్, ఖవాజా నఫే, ఫహీమ్ అష్రఫ్, అబ్రార్ అహ్మద్, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిక్ కూడా ఈ లిస్టులో ఉన్నారు. భారత స్పిన్ మాంత్రికుడు ధోనీ సలహాతో తన బౌలింగ్ శైలిని మార్చుకున్న ఉస్మాన్ తారిక్ ఈసారి పాకిస్థాన్‌కు ట్రంప్ కార్డ్‌గా మారే అవకాశం ఉంది.

రికార్డులు ఏం చెబుతున్నాయి?

టీ20 వరల్డ్ కప్ చరిత్రను చూస్తే పాకిస్థాన్‌పై భారత్‌దే పైచేయిగా ఉంది. ఇప్పటివరకు జరిగిన 8 ముఖాముఖి పోరుల్లో టీమిండియా 7 సార్లు విజయం సాధించగా, పాకిస్థాన్ కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే గెలిచింది. ఇటీవల జరిగిన ఆసియా కప్‌లో కూడా వరుసగా మూడు సార్లు పాకిస్థాన్‌ను మట్టికరిపించిన ఉత్సాహంతో భారత్ ఉంది. విరాట్ కోహ్లీ వంటి ఛేజింగ్ మాస్టర్ లేకపోయినా, సూర్యకుమార్ యాదవ్ తన దూకుడుతో పాక్ బౌలర్ల లయను దెబ్బతీస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. కొలంబో పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుండటంతో కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్ వంటి బౌలర్లు మ్యాచ్ ఫలితాన్ని మార్చగలరు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..