
బెల్ఫాస్ట్‌లోని స్టార్మాంట్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌కు భారీ టార్గెట్ ఇచ్చింది ఐర్లాండ్.టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ జట్టు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటోంది. ఓపెనర్ లోర్కాన్ టక్కర్ 36 బంతుల్లో 50 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు మంచి పునాది వేయగా. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గారెత్ డెలానీ వన్డే తరహా ఆటను పక్కనపెట్టి కేవలం 31 బంతుల్లోనే 49 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత్ ముందు 183 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచారు.
ఇక భారత బౌలర్లలో యువ సంచలనం హర్షిత్ రాణా అద్భుత ప్రదర్శన చేశాడు. ఇన్నింగ్స్‌లో 4 ఓవర్లు వేసిన హర్షిత్ కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ఐర్లాండ్ బ్యాటర్ల దూకుడికి బ్రేకులు వేశాడు. ఇక అక్షర్ పటేల్ , అర్ష్‌దీప్ సింగ్ చెరో రెండు వికెట్లు తీయగా.. శివం దూబె ఒకటి తీశాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.