పాక్ క్రికెట్ జట్టును నేను మారుస్తా – ఇమ్రాన్ ఖాన్

| Edited By: Pardhasaradhi Peri

Jul 22, 2019 | 7:04 PM

ఇంగ్లాండ్ ఆతిధ్యం ఇచ్చిన ప్రపంచకప్‌లో దాయాది పాకిస్థాన్ జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. దీనితో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నాడు. వచ్చే వరల్డ్‌కప్ నాటికి పాకిస్థాన్ జట్టును ప్రొఫెషనల్ జట్టుగా మారుస్తానని హామీ ఇచ్చాడు. అమెరికా పర్యటనలో ఉన్న ఇమ్రాన్ ఖాన్.. పాక్ జట్టు వరల్డ్‌కప్ ప్రదర్శనను ఉద్దేశించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ ‘ నా వ్యాఖ్యలు గుర్తుంచుకోండి. వచ్చే వరల్డ్‌కప్‌కు పాక్‌ జట్టు […]

పాక్ క్రికెట్ జట్టును నేను మారుస్తా - ఇమ్రాన్ ఖాన్
Follow us on

ఇంగ్లాండ్ ఆతిధ్యం ఇచ్చిన ప్రపంచకప్‌లో దాయాది పాకిస్థాన్ జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. దీనితో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నాడు. వచ్చే వరల్డ్‌కప్ నాటికి పాకిస్థాన్ జట్టును ప్రొఫెషనల్ జట్టుగా మారుస్తానని హామీ ఇచ్చాడు. అమెరికా పర్యటనలో ఉన్న ఇమ్రాన్ ఖాన్.. పాక్ జట్టు వరల్డ్‌కప్ ప్రదర్శనను ఉద్దేశించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ ‘ నా వ్యాఖ్యలు గుర్తుంచుకోండి. వచ్చే వరల్డ్‌కప్‌కు పాక్‌ జట్టు ఒక ప్రొఫెషనల్‌ జట్టుగా మారుస్తా. అత్యుత్తమ ఆటగాళ్ల ఎంపికే లక్ష్యంగా ముందుకెళతాం.

దీని కోసం క్షేత్రస్థాయిలో చర్యలు శ్రీకారం చుడతాం. అత్యుతమ ఆటగాళ్లను వెతికి పట్టుకుని.. పాకిస్థాన్ జట్టును పూర్తిగా సెట్ చేస్తామని ఆయన అన్నారు. తాను ఖచ్చితంగా పాక్ క్రికెట్‌ను ఉన్నత శిఖరాలకు చేరుస్తానని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. ఇది ఇలా ఉండగా పాకిస్థాన్.. ప్రపంచకప్‌లో ఐదో స్థానంలో నిలిచి లీగ్ దశలోనే నిష్క్రమించింది. ముఖ్యంగా వారికి నెట్‌ రన్‌రేట్ తక్కువ ఉండడంతో.. సెమీస్ అవకాశాలు కోల్పోయింది.