స్మిత్… కోహ్లీకి చేరువలో!

| Edited By:

Aug 20, 2019 | 7:28 AM

ఇటీవలే పునరాగమనం చేసిన స్మిత్‌.. మళ్లీ అగ్రస్థానం మీద కన్నేసినట్లున్నాడు. ర్యాంకింగ్స్‌లో అతను వడివడిగా ముందుకెళ్తున్నాడు. తాజాగా ర్యాంకింగ్స్‌లో కోహ్లి అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నప్పటికీ… సూపర్‌ఫామ్‌లో స్మిత్‌ అతణ్ని సమీపించాడు. ఇద్దరి మధ్య తేడా తొమ్మిది పాయింట్లే. సోమవారం ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో స్మిత్‌.. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానం సాధించాడు. కోహ్లి 922 పాయింట్లతో జాబితాలో ముందుండగా యాషెస్‌ తొలి టెస్టులో రెండు శతకాలు, రెండో టెస్టులో 92 చేసిన స్మిత్‌.. […]

స్మిత్... కోహ్లీకి చేరువలో!
Follow us on

ఇటీవలే పునరాగమనం చేసిన స్మిత్‌.. మళ్లీ అగ్రస్థానం మీద కన్నేసినట్లున్నాడు. ర్యాంకింగ్స్‌లో అతను వడివడిగా ముందుకెళ్తున్నాడు. తాజాగా ర్యాంకింగ్స్‌లో కోహ్లి అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నప్పటికీ… సూపర్‌ఫామ్‌లో స్మిత్‌ అతణ్ని సమీపించాడు. ఇద్దరి మధ్య తేడా తొమ్మిది పాయింట్లే. సోమవారం ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో స్మిత్‌.. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానం సాధించాడు. కోహ్లి 922 పాయింట్లతో జాబితాలో ముందుండగా యాషెస్‌ తొలి టెస్టులో రెండు శతకాలు, రెండో టెస్టులో 92 చేసిన స్మిత్‌.. 913 పాయింట్లతో అతడి వెనక ఉన్నాడు. కేన్‌ విలియమ్సన్‌ (887) మూడో స్థానంలో నిలిచాడు. పుజారా (4వ) టాప్‌-10లో కొనసాగుతున్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ప్యాట్‌ కమిన్స్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత స్పిన్నర్‌ రవీంద్ర జడేజా ఓ స్థానం మెరుగుపర్చుకుని ఐదో ర్యాంకు సాధించాడు. అశ్విన్‌ (10వ) ర్యాంకులో మార్పు లేదు. ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా మూడో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. టీమ్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌ 113 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.