క్రికెటర్లలో “బేబీ సిట్టర్లు”.. ఒకరు కాదు.. ఇద్దరు

యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి పోటీగా భారత్ జట్టులో మరో బేబీ సిట్టర్ రెడీ అవుతున్నాడు. బేబి సిట్టర్ పేరు వినగానే రిషబ్ పంత్ పేరు గుర్తొస్తుంది. గతేడాది చివర్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆసక్తికరంగా టెస్టు మ్యాచ్ జరుగుతుండగా.. రిషబ్ పంత్ ఏకాగ్రతని దెబ్బతీసేందుకు వికెట్ కీపర్ టిమ్ పైనీ స్లెడ్జింగ్‌కి దిగాడు. ఈ క్రమంలో నా పిల్లల్ని నువ్వు ఆడిస్తే..? నా భార్యతో కలిసి సినిమాకి వెళ్తానని సరదాగా కవ్వించిన పైనీ.. బేబి […]

క్రికెటర్లలో బేబీ సిట్టర్లు.. ఒకరు కాదు.. ఇద్దరు
Follow us

| Edited By:

Updated on: Aug 20, 2019 | 3:30 PM

యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి పోటీగా భారత్ జట్టులో మరో బేబీ సిట్టర్ రెడీ అవుతున్నాడు. బేబి సిట్టర్ పేరు వినగానే రిషబ్ పంత్ పేరు గుర్తొస్తుంది. గతేడాది చివర్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆసక్తికరంగా టెస్టు మ్యాచ్ జరుగుతుండగా.. రిషబ్ పంత్ ఏకాగ్రతని దెబ్బతీసేందుకు వికెట్ కీపర్ టిమ్ పైనీ స్లెడ్జింగ్‌కి దిగాడు. ఈ క్రమంలో నా పిల్లల్ని నువ్వు ఆడిస్తే..? నా భార్యతో కలిసి సినిమాకి వెళ్తానని సరదాగా కవ్వించిన పైనీ.. బేబి సిట్టింగ్ పదాన్ని పంత్‌ పైకి ప్రయోగించాడు. ఆ టెస్టు మ్యాచ్‌ తర్వాత పంత్ నిజంగానే టిమ్ పైనీ పిల్లల్ని ఆడిస్తూ దిగిన ఫొటో వైరల్‌గా మారింది. ఇటీవల వన్డే ప్రపంచకప్ సమయంలోనూ మహేంద్రసింగ్ ధోనీ కూతురు జీవాని రిషబ్ పంత్ ఆడిస్తూ కనిపించాడు. ఐపీఎల్ 2019 సమయంలోనూ రిషబ్ శిఖర్ దావన్ కొడుకు జొరావన్‌ని ఆడిస్తూ ఏడిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మొత్తానికి రిషబ్ పిల్లల్ని బాగా ఆడిస్తాడని.. బెస్ట్ బేబీ సిట్టర్ అంటూ టీమిండియాలో ముద్ర పడింది. భారత్ జట్టులో రిషబ్ పంత్‌కి పోటీగా మరో బేబి సిట్టర్ తయారయ్యాడు. అతడే వరల్డ్ కప్ విశ్రాంతి కోరిన హార్దిక్ పాండ్య. ప్రస్తుతం అతడు వెస్టిండీస్ పర్యటనకి దూరంగా ఉన్నాడు. ఈ సమయంలో స్పోర్ట్స్ ప్రజెంటర్ జతిన్ కూతురితో హార్దిక్ పాండ్య సరదాగా ఆడుకుంటూ ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బేబి సిట్టింగ్ సండే అంటూ పాండ్య ఆ వీడియోని అభిమానులతో పంచుకోవడంతో.. మరో బేబి సిట్టర్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Hardik Pandya Turns Babysitter