బీసీసీఐ లేఖపై స్పందించిన ఐసీసీ

| Edited By: Srinu

Mar 06, 2019 | 8:04 PM

దుబాయ్: బీసీసీఐ లేఖపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ శశాంక్ మనోహర్ స్పందించారు. వరల్డ్ కప్ – 2019 మ్యాచ్‌లకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తామని శశాంక్ మనోహర్ స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి మద్దతు తెలుపుతున్న దేశాలతో క్రికెట్ సంబంధాలు కొనసాగించరాదని ఐసీసీకి బీసీసీఐ లేఖ రాసింది. వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో ఆడే క్రికెటర్లకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తామని ఐసీసీ పేర్కొంది. ఈ విషయంలో బీసీసీఐకి హామీ ఇస్తున్నామని శశాంక్ మనోహర్ అన్నారు. బీసీసీఐ రాసిన లేఖ […]

బీసీసీఐ లేఖపై స్పందించిన ఐసీసీ
Follow us on

దుబాయ్: బీసీసీఐ లేఖపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ శశాంక్ మనోహర్ స్పందించారు. వరల్డ్ కప్ – 2019 మ్యాచ్‌లకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తామని శశాంక్ మనోహర్ స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి మద్దతు తెలుపుతున్న దేశాలతో క్రికెట్ సంబంధాలు కొనసాగించరాదని ఐసీసీకి బీసీసీఐ లేఖ రాసింది. వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో ఆడే క్రికెటర్లకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తామని ఐసీసీ పేర్కొంది. ఈ విషయంలో బీసీసీఐకి హామీ ఇస్తున్నామని శశాంక్ మనోహర్ అన్నారు. బీసీసీఐ రాసిన లేఖ తమకు అందిందని మనోహర్ తెలిపారు. దుబాయ్‌లో మార్చి 2వ తేదీన జరగనున్న ఐసీసీ బోర్డు సభ్యుల సమావేశంలో బీసీసీఐ లేఖపై పూర్తి స్థాయిలో చర్చించి వరల్డ్ కప్ మ్యాచ్‌లకు సెక్యూరిటీ ఏర్పాట్లపై బీసీసీఐకి తెలియజేస్తామని మనోహర్ స్పష్టం చేశారు.