అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) హాల్ ఆఫ్ ఫేమ్‌లో క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు స్థానం లభించిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఐసీసీ చేసిన ట్వీట్‌పై ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
‘‘ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి కొత్తగా లిటిల్ మాస్టర్ ఎంటర్ అవుతున్నాడు. అతడు అంత గొప్ప ఆటగాడా?’’ అంటూ ప్రశ్నించింది. ఇదే ఫ్యాన్స్ కోపానికి కారణమైంది. ‘‘ఆయన ప్రపంచం గర్వించదగ్గ గొప్ప ఆటగాడని.. ఇలాంటి చెత్త క్వశ్చన్‌ను ఎలా వేస్తారని?’’.. ‘‘అతడు ఓ లెజండ్.. ఈ విషయం తెలీకుండా ఐసీసీ ఆయనకు ఆ గౌరవం ఎలా ఇస్తుంది’’.. ‘‘ఇలాంటి చెత్త ప్రశ్నను మీరు వేయడం చాలా బాధగా ఉంది’’.. ‘‘సచిన్ సృష్టించిన విధ్వంస రికార్డులు మీకు కనిపించలేదా’’ అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.
కాగా సచిన్‌తో పాటు దక్షిణాఫ్రికా మాజీ పేసర్ అలెన్ డొనాల్డ్, ఆస్ట్రేలియా మాజీ మహిళా క్రికెటర్ ఫిట్జ్‌పాట్రిక్‌లకు సైతం ఈ అరుదైన గౌరవం లభించిన విషయం తెలిసిందే.
The 'Little Master' is the latest person to enter the ICC Hall of Fame!
Is he the greatest cricketer of all time? #ICCHallOfFame pic.twitter.com/8A7XAXGmxH
— ICC (@ICC) July 18, 2019