Women T20 Worldcup: మహిళల టీ20 వరల్డ్‌కప్‌పై ఐసీసీ కీలక ప్రకటన.. వరల్డ్‌కప్‌కు అర్హత ఎలా సాధించాలంటే..

|

Dec 13, 2020 | 5:25 PM

మహిళల టీ20 ప్రపంచ కప్‌నకు సంబంధించి ఐసీసీ కీలక ప్రకటన విడుదల చేసింది. 2023లో దక్షిణాఫ్రికాలో జగరనున్న మహిళల టీ20 వరల్డ్ కప్‌ అర్హత ప్రక్రియపై మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకల ప్రకారం.. మొత్తం 10 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయి.

Women T20 Worldcup: మహిళల టీ20 వరల్డ్‌కప్‌పై ఐసీసీ కీలక ప్రకటన.. వరల్డ్‌కప్‌కు అర్హత ఎలా సాధించాలంటే..
Follow us on

మహిళల టీ20 ప్రపంచ కప్‌నకు సంబంధించి ఐసీసీ కీలక ప్రకటన విడుదల చేసింది. 2023లో దక్షిణాఫ్రికాలో జగరనున్న మహిళల టీ20 వరల్డ్ కప్‌ అర్హత ప్రక్రియపై మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకల ప్రకారం.. మొత్తం 10 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయి. అయితే, ఆతిథ్య సౌతాఫ్రికాతో పాటు 2021, నవంబర్ చివరి నాటికి ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో టాప్-7లో ఉన్న జట్లు నేరుగా టీ20 వరల్డ్ కప్‌‌లో పోరుకు అర్హత సాధిస్తాయి. ఇక మిగిలిన బెర్త్‌ల కోసం క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లను నిర్వహిస్తారు. ఈ మ్యాచ్‌లలో 37 జట్లు తలపబడనున్నాయి. ఇందులో ఫైనల్‌కు చేరిన జట్లకు వరల్డ్ కప్‌లో బెర్త్ దక్కుతుంది. కాగా, మయన్మార్‌, ఫ్రాన్స్‌, భూటాన్‌, మలావీ, బోట్సువానా, ఫిలిప్సీన్స్‌, టర్కీ, కామెరూన్‌, తొలిసారి ఐసీసీ క్వాలిఫికేషన్‌ ఈవెంట్‌లో పాల్గొననున్నాయి. ఇదిలాఉంటే.. 2022 నవంబర్-డిసెంబర్‌లో టీ20 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా, దానిని రీషెడ్యూల్ చేశారు. 2023 ఫిబ్రవరి 9 నుంచి 26 వరకు ఈ మెగా టోర్నీని నిర్వహించనున్నారు. 2021, ఆగస్టు నుంచి రీజనల్ స్థాయిలో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.

Also Read:

AP Politics: మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ గోరంట్ల మాధవ్.. ఈసారి అగ్రకులాలు టార్గెట్‌గా హాట్ కామెంట్స్..

Plastic Rice: మంచిర్యాల జిల్లాలో మరో కలకలం.. రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఆనవాళ్లు.. ఆగ్రహించిన ప్రజలు..