Team India Captain: ఆస్ట్రేలియాపై భారత జట్టు చారిత్రాత్మక విజయం సాధించిన తరువాత అందరి దృష్టి టీమిండియా ప్లేయర్లపైనే పడింది. టీమిండియా ప్లేయర్ల కృషి, సమర్థత, ఆటతీరుపై మాజీలు మొదలు, ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారందరు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియాపై పోరులో టీమిండియాకు సారథ్యం వహించిన అజింక్య రహానేకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అతని సారథ్యానికి ప్రతి ఒక్కరు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఈ క్రమంలో క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెట్లు సైతం రహానేను టీమిండియాకు శాశ్వత కెప్టెన్‌గా నియమించాలని డిమాండ్లు చేశారు.. చేస్తున్నారు. తాజాగా రహానే కెప్టెన్సీపై ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ షేన్ లీ కూడా తన మనసులోని మాట బయటపెట్టాడు. రహానేకి కనుక కెప్టెన్సీ ఇస్తే.. టీమిండియా రిలాక్స్ అవుతుందన్నాడు. రహానే కెప్టెన్ అయితే ఆటగాళ్లంతా స్వేచ్ఛగా తమ ఆటను అడుతారని అభిప్రాయపడ్డాడు. కోహ్లీ విధానాలతో జట్టు సభ్యులు భయపడుతుండొచ్చని షేన్ లీ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
రహానే జట్టులోని ప్రతి ఒక్కరిని కలుపుకుపోతాడని, ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అద్భుతంగా సారథ్యం వహించాడని చెప్పుకొచ్చాడు షేన్ లీ. ఈ కారణంగానే రహానేని కెప్టెన్‌గా చేయాలని అభిప్రాయపడుతున్నానని పేర్కొన్నాడు. ‘కొహ్లీ గొప్ప ఆటగాడు అయినప్పటికీ.. జట్టులోని సభ్యులంతా అతనిని చూసి కాస్త భయంగా ఉంటారు. అదే రహానే సారథ్యంలో ఆ భయం టీమ్‌లోని ఇతర సభ్యుల్లో కనిపించలేదు. అందరూ రిలాక్స్‌డ్‌గా ఆడారు. అద్భుత విజయాన్ని నమోదు చేశారు. అందుకే బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీకి పూర్తిస్థాయి అవకాశం ఇచ్చి. రహానేకి కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించాలి. కోహ్లీ కెప్టెన్సీని వదులుకుంటాడా? లేదా? నాకు తెలియదు కానీ.. నేను ఇండియా క్రికెట్ సెలెక్టర్‌ని అయి ఉంటే మాత్రం రహానేని కెప్టెన్‌గా ఎంచుకుంటాను’ అని షేన్ లీ పేర్కొన్నాడు.
Also read:
ఓరుగల్లు సాక్షిగా పొలిటికల్ హీట్, రామమందిర విరాళాలపై మాటల యుద్ధం, పరకాల నియోజకవర్గంలో బంద్ ప్రశాంతం