5

ఆ హ్యాట్రిక్‌ ఘనత కోహ్లిదే: బుమ్రా

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో తాను హ్యాట్రిక్‌ సాధించిన ఘనతకు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లినే కారణమని టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాపేర్కొన్నాడు.  హ్యాట్రిక్‌ అందుకునే క్రమంలో విండీస్‌ ఆటగాడు రోస్టన్‌ ఛేజ్‌ను నాటౌట్‌గా ప్రకటించడంతో దీనిపై థర్డ్‌ అంపైర్‌ అప్పీల్‌ కోసం వెళ్లామని, ఇది సక్సెస్‌ కావడంతోనే అరుదైన ఘనత లిఖించినట్లు చెప్పాడు. ‘  ఛేజ్‌కు సంధించిన బంతి ప్యాడ్లకు తగలడంతో అప్పీల్‌ చేసినా ఫీల్డ్‌ అంపైర్‌ ఔట్‌ ఇవ్వలేదు. అయితే నిజంగా ఏమి జరిగిందో […]

ఆ హ్యాట్రిక్‌ ఘనత కోహ్లిదే: బుమ్రా
Follow us

| Edited By:

Updated on: Sep 02, 2019 | 4:21 AM

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో తాను హ్యాట్రిక్‌ సాధించిన ఘనతకు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లినే కారణమని టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాపేర్కొన్నాడు.  హ్యాట్రిక్‌ అందుకునే క్రమంలో విండీస్‌ ఆటగాడు రోస్టన్‌ ఛేజ్‌ను నాటౌట్‌గా ప్రకటించడంతో దీనిపై థర్డ్‌ అంపైర్‌ అప్పీల్‌ కోసం వెళ్లామని, ఇది సక్సెస్‌ కావడంతోనే అరుదైన ఘనత లిఖించినట్లు చెప్పాడు. ‘  ఛేజ్‌కు సంధించిన బంతి ప్యాడ్లకు తగలడంతో అప్పీల్‌ చేసినా ఫీల్డ్‌ అంపైర్‌ ఔట్‌ ఇవ్వలేదు. అయితే నిజంగా ఏమి జరిగిందో నాకు తెలియదు.. నేను అప్పీల్‌ చేద్దామని అనుకోలేదు. నేను ఇంకా సందిగ్థంలోనే ఉన్నా. కోహ్లి సమీక్ష కోరడంతో మాకు అనుకూలంగా వచ్చింది. హ్యాట్రిక్‌ ఘనత కోహ్లిదే’ అని బుమ్రా పేర్కొన్నాడు.

తొలి టెస్టులో విండీస్‌కు తన పేస్‌ రుచి చూపించిన బుమ్రా.. రెండో టెస్టులోనూ ఆతిథ్య జట్టును కోలుకోనివ్వలేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా టాప్‌-5 బ్యాట్స్‌మెన్‌ పనిపట్టాడు. ఇందులో ఓ హ్యాట్రిక్‌ ఉండటం విశేషం. బుమ్రా ధాటికి ఇద్దరూ బ్యాట్స్‌మెన్‌ పరుగులేమి చేయకుండా వెనుదిరగగా.. మరో ఇద్దరు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. దీంతో ఆతిథ్య జట్టు పూర్తిగా కష్టాల్లో పడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్‌ 33 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది.  భారత తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. హనుమ విహారి (225 బంతుల్లో 111; 16 ఫోర్లు) శతకానికి తోడు ఇషాంత్‌ శర్మ (80 బంతుల్లో 57; 7 ఫోర్లు) కూడా బ్యాటింగ్‌లో సత్తా చాటడంతో భారత్‌ నాలుగు వందల స్కోరును దాటింది.

Gold Price: బంగారం కొనేవారికి గుడ్‌ న్యూస్‌.. భారీగా తగ్గిన ధరలు
Gold Price: బంగారం కొనేవారికి గుడ్‌ న్యూస్‌.. భారీగా తగ్గిన ధరలు
ప్రపంచ కప్ చరిత్రలో బ్రేక్ చేయలేని 5 రికార్డులు.. అవేంటో తెలుసా?
ప్రపంచ కప్ చరిత్రలో బ్రేక్ చేయలేని 5 రికార్డులు.. అవేంటో తెలుసా?
ఆరో రోజు మెడల్ ఈవెంట్స్ ఇవే.. భారత ఆటగాళ్ల షెడ్యూల్ ఎలా ఉందంటే?
ఆరో రోజు మెడల్ ఈవెంట్స్ ఇవే.. భారత ఆటగాళ్ల షెడ్యూల్ ఎలా ఉందంటే?
నేటినుంచే వార్మప్ మ్యాచ్‌లు.. లైవ్ స్ట్రీమింగ్‌, వేదికల వివరాలు..
నేటినుంచే వార్మప్ మ్యాచ్‌లు.. లైవ్ స్ట్రీమింగ్‌, వేదికల వివరాలు..
లైంగిక వేధింపుల కేసులో క్లీన్ చిట్.. 11 నెలల తర్వాత స్వదేశానికి..
లైంగిక వేధింపుల కేసులో క్లీన్ చిట్.. 11 నెలల తర్వాత స్వదేశానికి..
World Cup: జరగబోయేది వరల్డ్ కప్ కాదు.. వరల్డ్ టెర్రరిస్ట్ కప్..
World Cup: జరగబోయేది వరల్డ్ కప్ కాదు.. వరల్డ్ టెర్రరిస్ట్ కప్..
ప్రపంచకప్‌లో అతిపెద్ద వివాదాలు ఇవే.. లిస్టులో భారత ఆటగాళ్లు కూడా
ప్రపంచకప్‌లో అతిపెద్ద వివాదాలు ఇవే.. లిస్టులో భారత ఆటగాళ్లు కూడా
రాశిఫలాలు: 12 రాశుల వారికి సెప్టెంబర్ 29 దినఫలాలు ఇలా..
రాశిఫలాలు: 12 రాశుల వారికి సెప్టెంబర్ 29 దినఫలాలు ఇలా..
World Cup: మారిన తుది జాబితా.. 10 జట్ల స్వ్కాడ్స్ ఎలా ఉన్నాయంటే?
World Cup: మారిన తుది జాబితా.. 10 జట్ల స్వ్కాడ్స్ ఎలా ఉన్నాయంటే?
ఆస్ట్రేలియా ఫైనల్ స్వ్కాడ్‌లో కీలక మార్పు.. తుఫాన్ ప్లేయర్ ఎంట్రీ
ఆస్ట్రేలియా ఫైనల్ స్వ్కాడ్‌లో కీలక మార్పు.. తుఫాన్ ప్లేయర్ ఎంట్రీ