IPL Auction 2021: ‘రెండు నిమిషాలకే కోహ్లీ నుంచి మెసేజ్ వచ్చింది.. చాలా ఉద్వేగానికి గురయ్యా..‘

|

Feb 22, 2021 | 9:55 PM

IPL Auction 2021: ఐపీఎల్ 2021 వేలం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఈ వేలంలో కేరళకు చెందిన 26 ఏళ్ల వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ మహ్మద్..

IPL Auction 2021: ‘రెండు నిమిషాలకే కోహ్లీ నుంచి మెసేజ్ వచ్చింది.. చాలా ఉద్వేగానికి గురయ్యా..‘
Follow us on

IPL Auction 2021: ఐపీఎల్ 2021 వేలం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఈ వేలంలో కేరళకు చెందిన 26 ఏళ్ల వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ మహ్మద్ అజారుద్దీన్‌ను రాజస్థాన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు దక్కించుకుంది. కనీస ధర అయిన రూ. 20 లక్షలకు అజారుద్దీన్‌ను ఆర్‌సీబీ సొంతం చేసుకుంది. అయితే, అజారుద్దీన్‌ను ఆర్‌సిబి సొంతం చేసుకున్న రెండు నిమిషాల్లోనే అతని ఫోన్‌కి ఊహించని వ్యక్తి నుంచి సందేశం వచ్చింది. అది చూసి షాక్ అవడం అజారుద్దీన్ వంతు అయ్యింది. ఇదే విషయాన్ని అజారుద్దీన్ మీడియాకు ఎంతో ఎగ్జైట్‌గా వెల్లడించాడు. ఫిబ్రవరి 18న జరిగిన ఐపీఎల్ వేలంలో బెంగళూరు జట్టు అజారుద్దీన్‌ను దక్కించుకోగా.. ఆ విషయాన్ని జట్టు కెప్టెన్ విరాట్ స్వయంగా అజారుద్దీన్‌కు చెప్పాడు. ‘ఆర్‌సిబీలోకి స్వాగతం. ఆల్ ది బెస్ట్. నేను విరాట్ కోహ్లీ’ అంటూ అతని ఫోన్‌కి సందేశం పంపించాడు విరాట్. అది చూసి అజారుద్దీన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడట. అది కలనా..? నిజమా..? అని కాసేపు నిర్ఘాంతపోయాడట. అంతేకాదు.. కోహ్లీ మెసేజ్ చదివాక చాలా ఉద్వేగానికి గురయ్యానని అజారుద్దీన్ చెప్పుకొచ్చాడు. తనకు కోహ్లీ మెసేజ్ చేస్తాడని కలలో కూడా ఊహించలేదన్నాడు.

Also read:

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ వేదికలు ఖరారు.. వివరాలు ఇవిగో.!

కుర్రకారు హృదయాలను దోచేసిన మిస్టరీ లేడీ.. సన్‌రైజర్స్‌తో ఉన్న ఆమె ఎవరంటే.!