ఒడిశా వేదికగా జరుగుతున్న హాకీ ప్రపంచకప్ నుంచి భారత్ నిష్క్రమించింది. క్వార్టర్ ఫైనల్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి పాలై ఇంటి దారి పట్టింది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన క్రాస్ ఓవర్ మ్యాచ్‌లో భారత్ అద్భుతంగా ఆడింది. ప్రత్యర్థి జట్టుతో పోటీపడి గోల్స్ చేసింది. దీంతో నిర్ణీత సమయంలో ఇరు జట్లు 3-3 గోల్స్ తేడాతో సమంగా నిలిచాయి. అయితే కీలకమైన పెనాల్టి షూటౌట్‌లో భారత ఆటగాళ్లు నిరాశపర్చారు. అదే సమయంలో ప్రత్యర్థి జట్టు దూకుడుగా ఆడింది. చివరకు షూటౌట్ రౌండ్‌లో 5-4 తేడాతో ఆతిథ్య జట్టును ఓడించి భారత అభిమానులకు కన్నీళ్లను మిగిల్చింది న్యూజిలాండ్. ఈ ఓటమితో టీమిండియా వరల్డ్‌కప్ నుంచి నిష్ర్కమించగా.. జనవరి 24న జరిగే క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ బెల్జియంతో తలపడనుంది కివీస్.
హాకీని పక్కన పెడితే.. క్రికెట్‌లోనూ భారత క్రీడాభిమానులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది న్యూజిలాండ్. మేజర్ టోర్నమెంట్లలో టీమిండియాకు వరుసగా షాక్‌లు ఇస్తోంది. హాకీ ప్రపంచకప్‌కు ముందు 2019 వన్డే క్రికెట్ ప్రపంచకప్‌ను ఎవరూ మర్చిపోలేరు. ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఆ ప్రపంచకప్ సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ భారత్‌ను ఓడించింది. ఇక 2021లో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌లో కూడా భారత్‌ను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది న్యూజిలాండ్ . సౌతాంప్టన్ వేదికగా జరిగిన ఈ ఫైనల్‌లో చివరి రోజు భారత్ నుంచి విజయాన్ని లాక్కుంది బ్లాక్ క్యాప్స్. ఇక 2021 టీ20 ప్రపంచ కప్‌లో కూడా గ్రూప్ దశలో భారత్‌ను ఓడించింది కివీస్. ఈ ఓటమి కారణంగా, భారత జట్టు మిగిలిన మ్యాచ్‌లలో గెలిచినప్పటికీ టోర్నీలో ముందుకు సాగలేక పోయింది.
Heartbreak for India as they bow out from FIH Odisha Hockey Men’s World Cup 2023 Bhubaneswar-Rourkela. Here are some crucial moments from the game.
??IND 3-3 NZL??
(SO: 4-5)#IndiaKaGame #HWC2023 #HockeyWorldCup2023 @CMO_Odisha @sports_odisha @IndiaSports @Media_SAI pic.twitter.com/CiXiy9JPU0— Hockey India (@TheHockeyIndia) January 22, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..