రికార్డుల రాజు.. కింగ్ కోహ్లీ గురించి ఆసక్తికర విషయాలు

| Edited By:

Nov 05, 2019 | 3:49 PM

భారత క్రికెట్‌లో రికార్డుల రారాజుగా వెలుగొందుతున్న టీమిండియా సారధి విరాట్ కోహ్లీ ఇవాళ 31వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు ఆయనకు తమ అభినందనలు చెబుతున్నారు. కాగా 2008లో టీమిండియాలో ఎంట్రీ ఇచ్చిన కోహ్లీ.. రన్ మిషన్‌గా పేరొంది.. ఎన్నో రికార్డులను తన పేరు మీద లిఖించుకున్నాడు. ఇక మ్యాచ్‌లో కోహ్లీ రికార్డుల గురించి పక్కనపెడితే.. అతడి గురించిన కొన్ని ఆసక్తికర […]

రికార్డుల రాజు.. కింగ్ కోహ్లీ గురించి ఆసక్తికర విషయాలు
Follow us on

భారత క్రికెట్‌లో రికార్డుల రారాజుగా వెలుగొందుతున్న టీమిండియా సారధి విరాట్ కోహ్లీ ఇవాళ 31వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు ఆయనకు తమ అభినందనలు చెబుతున్నారు. కాగా 2008లో టీమిండియాలో ఎంట్రీ ఇచ్చిన కోహ్లీ.. రన్ మిషన్‌గా పేరొంది.. ఎన్నో రికార్డులను తన పేరు మీద లిఖించుకున్నాడు. ఇక మ్యాచ్‌లో కోహ్లీ రికార్డుల గురించి పక్కనపెడితే.. అతడి గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం

  1. కోహ్లీ ముద్దు పేరు చీకూ. కోహ్లీ ఢిల్లీ రంజీ టీమ్‌లో చేరినప్పుడు ఆ జట్టు మాజీ కోచ్ అజిత్ చౌదరి అతడికి ఈ పేరును ఇచ్చాడు.
  2. 2006లో కర్ణాటకతో అతడు రంజీ మ్యాచ్ ఆడుతున్న సమయంలో అతడి తండ్రి మరణించాడు. అయితే మరుసటి రోజే బ్యాటింగ్ చేపట్టిన కోహ్లీ.. 90 పరుగులు చేశాడు.
  3. బాలీవుడ్ నటి కరిష్మా కపూర్‌ అంటే కోహ్లీకి చాలా ఇష్టం.
  4. అండర్-19 టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లీ.. 2008లో ప్రపంచకప్‌ను సాధించాడు.
  5. 2008లోనే టీమిండియాలో చోటు సాధించిన కోహ్లీ.. 2011లో టీమిండియా ప్రపంచకప్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
  6. కోహ్లీ శరీరం మీద మొత్తం తొమ్మిది టాటూలు ఉన్నాయి. వాటన్నింటి వెనుక ఉన్న అర్థాలను ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ వెల్లడించాడు.
  7. మటన్ బిర్యానీ, ఖీర్ అంటే కోహ్లీకి చాలా ఇష్టం. ముఖ్యంగా అమ్మ చేతి వంటను అతడు ఇష్టంగా తింటాడు.
  8. 2013లో కోహ్లీకి అర్జున్ అవార్డు వచ్చింది.
  9. 2013లో ఓ టీవీ కమర్షియల్‌లో అనుష్కను కలిసిన కోహ్లీ.. తరువాత ఆమెతో ప్రేమలో పడి.. 2017లో వివాహం చేసుకున్నాడు.కాగా ఈ సంవత్సరం తన పుట్టినరోజు వేడుకలను సతీమణితో కలిసికోహ్లీ భూటాన్‌లో జరుపుకుంటున్నారు.