Former Pakistan captain Inzamam-ul-Haq: పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనకు లాహోర్‌లోని ఓ ఆసుపత్రిలో సోమవారం సాయంత్రం యాంజియోప్లాస్టీ నిర్వహించారు. ఇంజమామ్‌కు యాంజియోప్లాస్టీ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఉన్నట్లు పేర్కొన్నారు. గత మూడు రోజుల నుంచి ఛాతీలో నొప్పి రావడంతో.. ఆయన ఆసుపత్రిలో చేరి టెస్టులు చేయించుకున్నారు. పరిశీలించిన వైద్యులు ఇంజమామ్ గుండెపోటుకు గురైనట్లు తేల్చి అత్యవసరంగా యాంజియోప్లాస్టీ నిర్వహించారు. ప్రస్తుతం ఇంజమామ్ పరిస్థితి నిలకడగా ఉందని, డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స జరుగుతుందని ఆయన సన్నిహితులు తెలిపారు. కాగా.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ గుండెపోటుకు గురయ్యారన్న వార్త తెలుసుకుని ఆయన అభిమానులు, సన్నిహితులు ఆందోళనకు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
1992 వరల్డ్‌కప్ గెలిచిన పాకిస్తాన్ జట్టులో సభ్యుడైన ఇంజమామ్.. అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా, కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు. 51 ఏళ్ల ఇంజమామ్ 1991లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి.. వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన పాకిస్తాన్ ఆటగాడిగా నిలిచాడు. 375 మ్యాచ్‌ల్లో 11701 పరుగులు చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన పాకిస్థానీ ఆటగాళ్లల్లో మూడో స్థానంలో నిలిచాడు. 119 మ్యాచ్‌ల్లో 8829 పరుగులు చేశాడు. 2007 లో ఇంజమామ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. పదవీ విరమణ తర్వాత కూడా.. ఆయన పాకిస్తాన్ క్రికెట్‌కు సేవలందించాడు. పలు ముఖ్యమైన పదవులను సైతం నిర్వహించారు.
Also Read: