టీమిండియా మాజీ క్రికెటర్, టెస్ట్ మ్యాచ్ ఓపెనర్ మాధవ్ ఆప్టే కన్నుమూశారు. ఆయన వయస్సు 86 ఏళ్లు. ఇవాళ ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఉదయం 6.00 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారని ఆయన కుమారుడు తెలిపారు. భారత జట్టుకు మొత్తం ఏడు టెస్టులు ఆడిన మాధవ్ ఆప్టే.. ఓపెనర్‌గా 13 ఇన్నింగ్స్‌లు ఆడి 542 పరుగులు చేశారు. అత్యధిక స్కోర్ 163 నాటౌట్. ఒక సెంచరీతో పాటు మూడు హాఫ్ సెంచరీలు చేశారు. 1951-1952 సీజన్‌లో బాంబే జట్టు తరఫున రంజీ మ్యాచ్‌తో అరంగేట్రం చేశారు. అదే మ్యాచ్‌లో సౌరాష్ట్ర జట్టుపై సెంచరీ చేసి.. అందరి దృష్టిని తనవైపు మరల్చుకున్నారు. స్ట్రోక్‌ప్లేతో సెలక్టర్లను ఆకర్షించిన ఆయన.. అతితక్కువ కాలంలోనే భారత జట్టుకు ఎంపికయ్యారు. 1952- 1953 సీజన్‌లో పాకిస్థాన్‌పై తొలిసారి టెస్టు సిరీస్‌కు ఎంపికై అక్కడ మంచి ప్రదర్శన చేశారు.
అనంతరం 1953 ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైన మాధవ్ ఓవల్‌లో జరిగిన ఓ టెస్టులో సెంచరీ చేసి జట్టును ఓటమి నుంచి తప్పించారు. ఫస్ట్ క్లాస్ క్రికెటర్‌గా 67 మ్యాచ్‌లు ఆడిన మాధవ్.. 102 ఇన్నింగ్స్‌ల్లో 3336 పరుగులు చేశారు. ఆరు సెంచరీలుతో పాటు.. 16 హాఫ్ సెంచరీలు చేశారు. మరోవైపు 1989లో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాకి అధ్యక్షుడిగా పనిచేసిన ఈ లెజెండరీ బ్యాట్స్‌మన్.. సచిన్ టెండుల్కర్‌కి క్రికెట్ ఆడేందుకు మెంబర్‌షిప్ ఇవ్వడం విశేషం.
“He will remain one of the most loved cricketers.”
Former India Test opener Madhav Apte passes away at 86.
READ: https://t.co/GkJXBmrwp4 pic.twitter.com/FN4NCbma9e
— ICC (@ICC) September 23, 2019