విషాదం…భారత మాజీ ఫుట్​బాలర్ బీర్ బహుదూర్ మృతి..

హైదరాబాద్‌కు చెందిన మాజీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫుట్‌బాలర్ బీర్‌ బహదూర్‌ (75) సికింద్రాబాద్‌లోని బోల్లార‌మ్ లో తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా కోమాలో ఉన్న ఆయన.. శనివారం మరణించారు. బొల్లారంకు చెందిన బహదూర్‌కు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. 1966 ఆసియా గేమ్స్ లో ఇండియా ఫుట్‌బాల్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన బహదూర్‌కు అటాకింగ్‌ ఫార్వర్డ్‌గా పేరుంది. ఈఎంఈ సెంటర్‌ తరఫున 1960-70 మధ్య ఆయన సంతోష్‌ ట్రోఫీ లాంటి పలు నేష‌నల్ టోర్నీల్లో పాల్గొన్నారు. ఆ […]

విషాదం...భారత మాజీ ఫుట్​బాలర్ బీర్ బహుదూర్ మృతి..

Updated on: May 31, 2020 | 5:28 PM

హైదరాబాద్‌కు చెందిన మాజీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫుట్‌బాలర్ బీర్‌ బహదూర్‌ (75) సికింద్రాబాద్‌లోని బోల్లార‌మ్ లో తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా కోమాలో ఉన్న ఆయన.. శనివారం మరణించారు. బొల్లారంకు చెందిన బహదూర్‌కు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

1966 ఆసియా గేమ్స్ లో ఇండియా ఫుట్‌బాల్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన బహదూర్‌కు అటాకింగ్‌ ఫార్వర్డ్‌గా పేరుంది. ఈఎంఈ సెంటర్‌ తరఫున 1960-70 మధ్య ఆయన సంతోష్‌ ట్రోఫీ లాంటి పలు నేష‌నల్ టోర్నీల్లో పాల్గొన్నారు. ఆ త‌ర్వాత బహదూర్‌ ఆర్థికంగా అనేక‌ ఇబ్బందులు ఎదుర్కొన్నారు‌. పానీపురి బండి పెట్టుకుని కుటుంబాన్ని పోషించారు. చనిపోయే ముందు కుటుంబానికి మందులు కొనడం కూడా కష్టమైంది. బీర్‌ బహదూర్ మ‌ర‌ణం పట్ల తెలంగాణ ఫుట్‌బాల్‌ సమాఖ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.