Indian Cricketers: పెళ్లైన మహిళలను వివాహమాడిన క్రికెట్ ప్లేయర్లు వీరే.. ఇంట్రస్టింగ్ విషయాలు మీకోసం..

|

Sep 08, 2021 | 5:52 AM

Indian Cricketers: ప్రేమ గుడ్డిది అనే నానుడి అందరికీ తెలిసిందే. ఈ నానుడి ముఖ్యంగా క్రికెట్ ప్రపంచానికి సరిగ్గా సూట్ అవుతుందనే చెప్పాలి. ఇదే విషయం అనేకసార్లు నిరూపితం అయ్యింది కూడా.

Indian Cricketers: పెళ్లైన మహిళలను వివాహమాడిన క్రికెట్ ప్లేయర్లు వీరే.. ఇంట్రస్టింగ్ విషయాలు మీకోసం..
Dhawan
Follow us on

Indian Cricketers: ప్రేమ గుడ్డిది అనే నానుడి అందరికీ తెలిసిందే. ఈ నానుడి ముఖ్యంగా క్రికెట్ ప్రపంచానికి సరిగ్గా సూట్ అవుతుందనే చెప్పాలి. ఇదే విషయం అనేకసార్లు నిరూపితం అయ్యింది కూడా. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నప్పటికీ.. చాలా మంది టీమిండియా క్రికెటర్లు.. గతంలో వివాహం జరిగిన మహిళలతో ప్రేమలో పడ్డారు. అంతేకాదు.. వారితో ఏడడుగులు నడిచి సంతోషకరమైన జీవితాన్ని గడిపారు. అయితే కొందరు మాత్రం విడిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. మరి వివాహితలను మ్యారేజీ చేసుకున్న ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ ఎవరు? చేసుకున్న కొద్ది కాలానికే విడాకులు ఇచ్చింది ఎవరు? ఇలాంటి ఆసక్తికర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం..

శిఖర్ ధావన్:
మొదటి భర్తకు విడాకులు ఇచ్చి, ఇద్దరు కుమార్తెలు కలిగిన అయేషా ముఖర్జీని టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లి చేసుకుని తన ప్రేమకు పరిమితులు లేవని చాటిచెప్పాడు. అయేషా ముఖర్జీ తండ్రి ఇండియన్ కాగా, తల్లి విదేశీయురాలు. అయేషా ఇండియాలో జన్మించిన తరువాత ఆమె కుటుంబం ఆస్ట్రేలియాకు మకాం మార్చేసింది. ప్రొఫెషనల్ కిక్ బాక్సర్ అయిన అయేషా.. గతంలో ఆస్ట్రేలియన్ వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. తాజాగా వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రమ్ వేదికగా అయేషా ముఖర్జీ చేసిన పోస్ట్ ఈ విషయాన్ని నిర్ధారిస్తోంది.

అనిల్ కుంబ్లే:
అనిల్ కుంబ్లే.. లెజెండరీ బౌలర్. అప్పటికే వివాహం జరిగిన మహిళతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఆ తరువాత ఆమెను వివాహం చేసుకున్నాడు. లాంగ్ ఫార్మాట్‌లో భారతదేశం తరఫున అత్యధిక వికెట్లు తీసిన అనీల్ కుంబ్లే.. ట్రావెల్ ఏజెన్సీలో స్టాక్ బ్రోకర్‌గా పని చేసిన చేతన్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు అప్పటికే ఓ సంతానం కూడా ఉంది.

మురళీ విజయ్:
టీమిండియా ఇండియా టెస్ట్ ఓపెనర్ వైవాహిక జీవితం.. శ్రీలంక ప్లేయర్ తరంగాకు చాలా దగ్గరగా ఉంటుంది. తరంగ మాదిరిగానే.. మురళీ విజయ్ కూడా తన సహచర క్రికెటర్ భార్యతో ప్రేమలో పడ్డాడు. తన సహచరుడు, స్నేహితుడైన దినేష్ కార్తిక్‌ భార్య నికితను పెళ్లాడాడు. కార్తిక్‌ను పెళ్లి చేసుకున్న నికిత.. కొంతకాలం తరువాత.. మురళీ విజయ్‌తో సంబంధం కొనసాగించింది. ఈ విషయం తెలుసుకున్న దినేష్ కార్తిక్.. తన భార్య నికితకు విడాకులు ఇచ్చాడు. ఆ తరువాత మురళీ విజయ్.. నికితను వివాహం చేసుకున్నాడు. విజయ్ పెళ్లి చేసుకునే సమయానికి నికిత గర్భవతి. ప్రస్తుతం వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు.

మహమ్మద్ షమీ :
మహమ్మద్ షమీ 2014 లో హసీన్ జహాన్‌ను పెళ్లి చేసుకున్నాడు. అయితే, హాసిన్ జహాన్‌కు ఇంతకు ముందే వివాహం జరిగింది, ఒక కూతురు కూడా ఉంది. 2012లో మహమ్మద్ షమీ, హసీన్ ఐపిఎల్ మ్యాచ్ సందర్భంగా కలుసుకున్నారు. వీరి ఫస్ట్ మీట్‌లోనే షమీ.. హాసిన్ జహాన్‌తో ప్రేమలో పడ్డాడు. వారిద్దరూ ఒకరితో ఒకరు డేటింగ్ చేయడం ప్రారంభించారు. చాలా కాలం ఇలా కొనసాగిన తరువాత.. వారిద్దరూ 6 జూన్, 2014 న మొరాదాబాద్-ఢిల్లీ రోడ్‌లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో వివాహం చేసుకున్నారు. కొంతమంది ప్రత్యేక వ్యక్తులు మాత్రమే వారి వివాహానికి హాజరయ్యారు. హసీన్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకోగా.. చిన్నప్పటి నుంచి ఆమెకు మోడలింగ్ పట్ల ఆసక్తి ఉంది. కొంతకాలం మోడలింగ్ కూడా చేయగా.. ఐపీఎల్ మ్యాచ్‌లలో చీర్‌ లీడర్‌గా కూడా పని చేసింది. అయితే, వివాహం తర్వాత ఆమె తన వృత్తిని వదిలివేసింది. అనంతరం కాలంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం హసీన్ జహాన్, మహమ్మద్ షమీ విడాకులు తీసుకున్నారు.

వెంకటేశ్ ప్రసాద్:
వెంకీ అకా వెంకటేశ్ ప్రసాద్ 1996 లో ఓ వివాహితను ప్రేమ వివాహం చేసుకున్నాడు. టీమిండియా ప్లేయర్ అనిల్ కుంబ్లే ద్వారా 1994 లో జయంతిని కలిశాడు. జయంతికి అప్పటికే వివాహం అవగా.. విడాకులు తీసుకుంది. అయితే, వెంకీకి మొదటగా జయంతి ప్రపోజ్ చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. కానీ, ఆ సమయంలో అతను స్టార్ క్రికెటర్ కాదు. కాగా, వెంకీ-జయంతిల వివాహం పట్ల అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కారణంగా.. వెంకీ కంటే జయంతి వయస్సులో పెద్దట. మొత్తానికి ఇద్దరికీ వివాహం జరిగింది. వీరిద్దరూ హ్యాపీగా వైవాహిక జీవితాన్ని గడుపుతున్నారు.

Also read:

Whatsapp Features: వాట్సప్ నుంచి మరో సరికొత్త ఫీచర్.. ఇకపై సెలక్టీవ్‌గా హైడ్ చేసుకోవచ్చు.. అదెలాగంటే..

Shikhar Dhawan Net Worth: అత్యంత ధనవంతులైన క్రికెటర్లలో శిఖర్ ధావన్.. సంపాదన ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..

Visakhapatnam: విశాఖను వణికిస్తున్న సీజన్ వ్యాధులు.. స్పెషల్ ఫోకస్ పెట్టిన ఆంధ్రప్రదేశ్ సర్కార్..