రెజ్లింగ్‌కు గుడ్‌బై చెప్పిన ‘ది రాక్‌’

|

Aug 06, 2019 | 8:46 PM

డ్వేన్‌ జాన్సన్‌.. అంటే పెద్దగా ఎవరికీ తెలీదు. ‘ది రాక్‌’ అంటే చిన్నపిల్లలు కూడా ఇట్టే గుర్తు పట్టేస్తారు. డబ్ల్యూడబ్ల్యూఈ ద్వారా ఈయన ప్రపంచ వ్యాప్తంగా ఫేమ్ తెచ్చుకున్నారు. రింగ్‌లోకి దిగిన ‘ది రాక్‌’ను చూస్తే.. ప్రత్యర్థి ఎవరైనా భయంతోనే సగం ఓడిపోతారు. ఆయన పంచ్‌లో బేస్ ఆ రేంజ్‌లో ఉంటుంది.  అయితే, ఇక నుంచి ఆయన రెజ్లింగ్‌కు దూరం కాబోతున్నారు. నటుడిగా మారిన తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ నుంచి  దూరమైన డ్వేన్‌ జాన్సన్‌ ఇక ప్రొఫెషనల్‌ రెజ్లింగ్‌కు […]

రెజ్లింగ్‌కు గుడ్‌బై చెప్పిన ‘ది రాక్‌’
Follow us on

డ్వేన్‌ జాన్సన్‌.. అంటే పెద్దగా ఎవరికీ తెలీదు. ‘ది రాక్‌’ అంటే చిన్నపిల్లలు కూడా ఇట్టే గుర్తు పట్టేస్తారు. డబ్ల్యూడబ్ల్యూఈ ద్వారా ఈయన ప్రపంచ వ్యాప్తంగా ఫేమ్ తెచ్చుకున్నారు. రింగ్‌లోకి దిగిన ‘ది రాక్‌’ను చూస్తే.. ప్రత్యర్థి ఎవరైనా భయంతోనే సగం ఓడిపోతారు. ఆయన పంచ్‌లో బేస్ ఆ రేంజ్‌లో ఉంటుంది.  అయితే, ఇక నుంచి ఆయన రెజ్లింగ్‌కు దూరం కాబోతున్నారు. నటుడిగా మారిన తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ నుంచి  దూరమైన డ్వేన్‌ జాన్సన్‌ ఇక ప్రొఫెషనల్‌ రెజ్లింగ్‌కు గుడ్‌బై చెప్పేశాడు. జాన్సన్‌ తన చివరి మ్యాచ్‌ను 2006లో ఎరిక్‌ రోవన్‌తో తలపడ్డాడు.

డ్వేన్‌ జాన్సన్‌ 1972 మే2న కాలిఫోర్నియాలో ప్రముఖ రెజ్లర్‌ రాకీ జాన్సన్‌, అటా జాన్సన్‌ దంపతులకు జన్మించాడు. కొంతకాలం తల్లి కుటుంబంతో కలిసి న్యూజిలాండ్‌లో పెరిగాడు. ఫుట్‌బాల్‌ క్రీడాకారుడిగా కెరీర్‌ను ప్రారంభించిన జాన్సన్‌ ఆ తర్వాత ప్రొఫెషనల్‌ రెజ్లింగ్‌ వైపు మొగ్గు చూపాడు. దాన్నే కెరీర్‌గా ఎంచుకున్నాడు. 1996లో జరిగిన యూఎస్‌డబ్ల్యూఏ ట్యాగ్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌లో విజయం సాధించడంతో డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ జాన్సన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అక్కడి నుంచి జాన్సన్‌ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.  అనేక ఛాంపియన్‌షిప్‌లు సాధించిన ‘ది రాక్‌’ 1999లో ‘బియాండ్‌ ది మ్యాట్‌’ అనే డాక్యుమెంటరీతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన నటనకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు.