T20 WORLD CUP: దినేష్ కార్తీక్ కు గాయం.. బంగ్లాదేశ్ తో మ్యాచ్ కు దూరం.. పంత్ కు ఛాన్స్ దక్కేనా..?

|

Oct 31, 2022 | 11:18 AM

దినేష్ కార్తీక్ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడని పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ధృవీకరించాడు. వైద్యుల నివేదిక తర్వాత పూర్తి సమాచారం తెలుస్తుందని అన్నాడు. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం ఒక పరుగు మాత్రమే చేసిన..

T20 WORLD CUP: దినేష్ కార్తీక్ కు గాయం.. బంగ్లాదేశ్ తో మ్యాచ్ కు దూరం.. పంత్ కు ఛాన్స్ దక్కేనా..?
Dinesh Kartik
Follow us on

టీ20 ప్రపంచకప్ కు ముందు టీమిండియా ఆటగాళ్లను వేధించిన గాయాల సమస్య.. మళ్లీ వెంటాడుతోంది. ఇప్పటికే గాయం కారణంగా పేస్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా టీ20 ప్రపంచకప్ కు దూరం కాగా.. తాజాగా దినేష్ కార్తీక్ వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. దీంతో తరువాత మ్యాచ్ లకు దినేష్ కార్తీక్ అందుబాటులో ఉండటం అనుమానమే. టీ20 ప్రపంచకప్ సూపర్ 12 మ్యాచుల్లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కీలక ఆటగాడు దినేష్ కార్తీక్ వెన్ను గాయానికి గురయ్యాడు. దీంతో ఆడిలైడ్ లో నవంబర్ రెండో తేదీన బంగ్లాదేశ్ తో జరగనున్న మ్యాచ్ కు దూరం కానున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో బౌన్స్, స్వింగ్‌ బాల్స్ ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డాడు. దీంతో 15 బంతుల్లో ఆరు పరుగులు మాత్రమే చేయగలిగాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ లో 15 ఓవర్ల ముగిసిన తర్వాత కార్తీక్ వెన్నునొప్పితో బాధపడుతూ మైదనం వీడి వెళ్లాడు. దినేష్ కార్తీక్ స్థానంలో రిషబ్ పంత్ కీపింగ్ చేశాడు. గాయం తీవ్రతపై స్పష్టత లేకపోయినా నవంబర్ రెండో తేదీ బుధవారం బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ కు దినేష్ కార్తీక్ అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువుగానే ఉన్నట్లు తెలుస్తోంది.

దినేష్ కార్తీక్ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడని పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ధృవీకరించాడు. వైద్యుల నివేదిక తర్వాత పూర్తి సమాచారం తెలుస్తుందని అన్నాడు. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం ఒక పరుగు మాత్రమే చేసిన దినేష్ కార్తీక్ నెదార్లాండ్ తో బ్యాంటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఒకవేళ తరువాత మ్యాచ్ లకు దినేష్ కార్తీక్ దూరమైనా.. రిషబ్ పంత్ రూపంలో ప్రత్యామ్నాయ ఆటగాడు అందుబాటులో ఉండటంతో టీమిండియాకు పెద్ద సమస్య ఉండకపోవచ్చు. అయితే డెత్ ఓవర్లలో కనుక దినేష్ కార్తీక్ బ్యాటింగ్ చేస్తే ఎక్కువ పరుగులు చేయగల సామర్థ్యం దినేష్ కార్తీక్ ఉంది. పంత్ కూడా వేగంగా ఆడగలడు. దీంతో దినేష్ కార్తీక్ స్థానాన్ని రిషబ్ పంత్ తో భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు ప్రధాన వికెట్ కీపర్ పాత్రను పోషిస్తున్నాడు దినేష్ కార్తీక్. 37 ఏళ్ల వయసులో కూడా టీమిండియాలో కమ్ బ్యాక్ ఇచ్చిన దినేష్ కార్తీక్, ఐపీఎల్ 2022 సీజన్ తో పాటు ఆ తరువాత జరిగిన మ్యాచుల్లోనూ చివరిలో వచ్చి మెరుపులు మెరిపించి సెలక్టర్లను మెప్పించాడు. దీంతో ఆసియాకప్ 2022 ఆడిన దినేష్ కార్తీక్ కు టీ20 ప్రపంచకప్ కు కూడా ఎంపికయ్యాడు. సంజూ శాంసన్, ఇసాన్ కిషన్ లాంటి యువ వికెట్ కీపర్లను పక్కనపెట్టి, సీనియర్ మోస్ట్ వికెట్ కీపర్ దినేశ్‌ కార్తీక్ కి టీ20 ప్రపంచకప్ లో చోటె కల్పించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయినా బీసీసీఐ సెలక్టర్లు ఎవరి విమర్శలను పట్టించుకోకుండా కార్తీక్ కు చోటు కల్పించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..