అస్సలు తగ్గనంటోన్న వార్నర్.. ‘రాములో రాముల’ పాటకు అదరగొట్టాడుగా..!

టిక్‌టాక్‌లు చేయడంలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ దంపతులు అస్సలు తగ్గడం లేదు. తరచుగా టిక్‌టాక్‌లు చేస్తూ ఫ్యాన్స్‌ని తెగ ఆకట్టుకుంటున్నారు.

అస్సలు తగ్గనంటోన్న వార్నర్.. రాములో రాముల పాటకు అదరగొట్టాడుగా..!

Edited By:

Updated on: May 12, 2020 | 6:07 PM

టిక్‌టాక్‌లు చేయడంలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ దంపతులు అస్సలు తగ్గడం లేదు. తరచుగా టిక్‌టాక్‌లు చేస్తూ ఫ్యాన్స్‌ని తెగ ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగు, తమిళం పాటలు, డైలాగ్‌లను ఎంచుకుంటున్న ఈ క్రికెటర్.. వాటికి తమదైన స్టైల్‌లో స్టెప్‌లు వేస్తూ వావ్ అనిపిస్తున్నారు. ఆ మధ్యన బుట్ట బొమ్మ పాటకు, ఆ తరువాత సన్నజాజి పడక పాటకు డ్యాన్స్‌ వేశారు వార్నర్ దంపతులు. అంతేకాదు బ్యాట్‌ పట్టి పోకిరి డైలాగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇక తాజాగా అల వైకుంఠపురములోని రాములో రాముల పాటకు డ్యాన్స్ వేశారు వార్నర్ దంపతులు. వారి డ్యాన్స్ అదరగొడుతుండగా.. వార్నర్ కుమార్తె ఇంకా ముద్దుగా చేసింది. ఇక ఈ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో అతడి ఫ్యాన్స్‌తో పాటు అల్లు అర్జున్ అభిమానులు సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read This Story Also: మీ వ్యక్తిత్వం నా మనసును కదిలించిందమ్మా.. మహిళా పోలీస్‌పై చిరు ప్రశంసలు..!