కేంద్రం షాకింగ్ నిర్ణయం.. క్రికెటర్లకు డోపింగ్ టెస్టులు తప్పనిసరి!

| Edited By: Pardhasaradhi Peri

Aug 09, 2019 | 7:43 PM

టీమిండియా క్రికెటర్లు కూడా ఇకపై డోపింగ్ పరీక్షలకు హాజరు కావాల్సిందేనంటూ కేంద్ర క్రీడాశాఖ బీసీసీఐకు స్పష్టం చేసింది. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఈ పరీక్షలు నిర్వహిస్తుంది. దీనితో క్రికెటర్లు నాడా నిర్వహించే పరీక్షలకు తప్పక హాజరు కావాలి. అయితే గతంలో బీసీసీఐ నాడా తమపై పరీక్షలు చేయరాదంటూ వాదించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి బోర్డు క్రికెటర్లకు ఇన్నాళ్లూ డోప్‌ టెస్టులు నిర్వహిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు క్రీడాశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో […]

కేంద్రం షాకింగ్ నిర్ణయం.. క్రికెటర్లకు డోపింగ్ టెస్టులు తప్పనిసరి!
Follow us on

టీమిండియా క్రికెటర్లు కూడా ఇకపై డోపింగ్ పరీక్షలకు హాజరు కావాల్సిందేనంటూ కేంద్ర క్రీడాశాఖ బీసీసీఐకు స్పష్టం చేసింది. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఈ పరీక్షలు నిర్వహిస్తుంది. దీనితో క్రికెటర్లు నాడా నిర్వహించే పరీక్షలకు తప్పక హాజరు కావాలి. అయితే గతంలో బీసీసీఐ నాడా తమపై పరీక్షలు చేయరాదంటూ వాదించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి బోర్డు క్రికెటర్లకు ఇన్నాళ్లూ డోప్‌ టెస్టులు నిర్వహిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు క్రీడాశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఇక ఆటగాళ్లు డోప్ పరీక్షలకు లోను కానున్నారు.

ఇది ఇలా ఉండగా యువ క్రికెటర్ పృథ్వీ షా తాజాగా డోప్ టెస్ట్‌లో విఫలమై.. 8 నెలల సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే. డోపింగ్ టెస్ట్‌లో  నిషేదిత డ్రగ్ టెర్బుటలైన్‌‌ను షా తీసుకున్నాడని ఖరారైంది. ఇక పృథ్వీ షా.. తెలియక టెర్బుటలైన్‌ మెడిసిన్‌ తీసుకున్నట్లు చెప్పడం.. ఆ వివరణను బీసీసీఐ పరిగణలోకి తీసుకుని తక్కువ శిక్ష విధించడం జరిగింది. అయితే అంతర్జాతీయ డోపింగ్‌ వ్యతిరేక ఏజెన్సీ గుర్తించిన సంస్థ ద్వారానే డోప్‌ టెస్ట్‌లు నిర్వహించాలని కేంద్రం బోర్డుకు సూచించింది.

మరోవైపు బీసీసీఐ మాత్రం తమ డోపింగ్ టెస్టులు అత్యున్నత ప్రమాణాలతోనే జరుగుతున్నాయని పేర్కోవడం విశేషం. అయితే క్రీడాశాఖ నుంచి ఆదేశాలు రావడంతో టీమిండియా ప్లేయర్స్ ఖచ్చితంగా నాడా డోపింగ్ టెస్టులకు పాల్గొనాల్సిందే. కానీ బీసీసీఐ మాత్రం నాడా పనితీరుపై తమకు అనుమానాలు ఉన్నాయని ఆందోళన చెందుతోంది.