టీ20 మ్యాచ్‌ల్లో ఎన్ని లక్ష్యచేధనలను చూశారు.? కేవలం 12 బంతుల్లోనే టార్గెట్‌ను ఛేజ్ చేయడం మీరెప్పుడైనా చూశారా.? బహుశా చూసి ఉండకపోవచ్చు. కానీ జింబాబ్వే టీం అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. మొదట బంతితో.. ఆ తర్వాత బ్యాట్‌తో విధ్వంసం సృష్టించింది. ఈ మ్యాచ్ మహిళల ఐసీసీ టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో జరిగింది. తాజాగా, జింబాబ్వే, ఈశ్వతిని జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో.. జింబాబ్వే 10 వికెట్లతో 108 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ చేధించింది.
స్వాజిలాండ్ అని పిలువబడే ఈశ్వతిని జట్టు ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లకు కేవలం 17 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ టీం 10 ఓవర్లు కూడా ఆడలేకపోయింది. ఈశ్వతిని జట్టు 9.2 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. ఆ జట్టులో ఏడుగురు బ్యాట్స్‌మెన్లు డకౌట్‌గా వెనుదిరిగారు. అత్యధిక స్కోరర్ 6 పరుగులు చేయగా.. ఎక్స్‌ట్రాల ద్వారా అదనపు పరుగులు వచ్చాయి.
జింబాబ్వే బౌలర్లు ఈశ్వతిని బ్యాట్స్‌మెన్‌లకు చుక్కలు చూపించారు. బోఫానా 4 ఓవర్లలో 11 పరుగులిచ్చి 6 వికెట్లు తీయగా, ఫిరి 1.2 ఓవర్లలో కేవలం 1 పరుగు ఇచ్చి 3 వికెట్లు తీశారు. అటు సిబండా 1 వికెట్ పడగొట్టింది. బోఫానా తన అద్భుత బౌలింగ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంది.
18 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే కేవలం 12 బంతుల్లో దాన్ని పూర్తి చేసింది. అంటే, 2 ఓవర్లలో 20 ఓవర్ల లక్ష్యాన్ని ముగించింది. ఈ విజయంతో జింబాబ్వే మహిళల క్రికెట్ జట్టు ఇప్పుడు గ్రూప్ Aలో రెండవ స్థానంలో నిలిచింది. 2 మ్యాచ్‌లలో 2 విజయాలతో 4 పాయింట్లు గెలుచుకుంది.
Also Read: