ODI Records: 22 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. బద్దలైన సచిన్ ఆల్‌టైమ్ వన్డే రికార్డ్.. అదేంటంటే?

Brendan Taylor Breaks Sachin Tendulkar: అంతర్జాతీయ వన్డే క్రికెట్ హిస్టరీలో భారత దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) పేరిట ఉన్న ఒక చారిత్రక రికార్డు బద్దలైంది. జింబాబ్వే (Zimbabwe) సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ బ్రెండన్ టేలర్ (Brendan Taylor) ఈ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పి చరిత్ర సృష్టించాడు.

ODI Records: 22 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. బద్దలైన సచిన్ ఆల్‌టైమ్ వన్డే రికార్డ్.. అదేంటంటే?
Brendan Taylor Breaks Sachin Tendulkar

Updated on: Sep 15, 2026 | 5:47 PM

Brendan Taylor Breaks Sachin Tendulkar: ఇంటర్నెషనల్ క్రికెట్ లో ఎక్కువ కాలం సాగడం అంటే ఏ ఆటగాడికైనా పెద్ద సవాలే. ఓవైపు పెరుగుతున్న వయసు, మరోవైపు ఫాంతోపాటు ఆరోగ్యం ఇలా ఎన్నో సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది. తాజాగా ఇలాంటి ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు 40 ఏళ్ల జింబాబ్వే వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ బ్రెండన్ టేలర్. ఆస్ట్రేలియా (Australia) జట్టుతో జరుగుతోన్న వన్డే మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. ఈ వన్డేతో ఏకంగా 22 సంవత్సరాల 148 రోజుల కాలాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈక్రమంలోనే వన్డే ఫార్మాట్‌లో అత్యంత ఎక్కువ కాలం పాటు సేవలందించిన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఈ రికార్డ్ ఇప్పటివరకు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ రికార్డును అధిగమించి ఈ జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

ఎక్కువమంది చదివినది: మేమైతే గెలిచాం.. అతనిపై ఇక నమ్మకం లేదు.. నెక్ట్స్ మ్యాచ్ నుంచి తీసేసుడే: శ్రేయాస్ అయ్యర్

గతంలో సచిన్ టెండూల్కర్ తన వన్డే కెరీర్‌లో 22 ఏళ్ల 91 రోజుల పాటు కొనసాగి అగ్రస్థానంలో నిలిచారు. తాజా పరిణామంతో ఆయన రెండో స్థానానికి పరిమితమయ్యారు. ఈ జాబితాలో శ్రీలంక (Sri Lanka) మాజీ డాషింగ్ ఓపెనర్ సనత్ జయసూర్య (Sanath Jayasuriya) 21 ఏళ్ల 184 రోజుల కెరీర్‌తో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. రెండు దశాబ్దాలకు పైగా అంతర్జాతీయ స్థాయి ఒత్తిడిని తట్టుకుంటూ మ్యాచ్ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘట్టంగా నిలుస్తుంది.

ఇవి కూడా చదవండి

ఎక్కువమంది చదివినది: వైభవ్ ఆటకట్టిస్తాం.. పక్కాప్లాన్‌తో దూల తీర్చేస్తాం..: జపాన్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..!

టేలర్ అంతర్జాతీయ వన్డే ప్రయాణం 2004 సంవత్సరంలో ప్రారంభమైంది. అప్పటి కాలం మొదలుకొని ఇప్పటివరకు జట్టు సాధించిన పలు చిరస్మరణీయ విజయాలలో ఆయన కీలక భూమిక పోషించారు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 207 వన్డే మ్యాచ్‌లలో బరిలోకి దిగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్, 11 సెంచరీలు నమోదు చేసి జట్టు ప్రధాన బ్యాటింగ్ ఆధారంగా నిలిచారు. అగ్రశ్రేణి జట్ల బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ నిలకడైన ప్రదర్శన కనబరిచిన టేలర్, ఈ మైలురాయితో క్రికెట్ పుస్తకాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us