IND vs ZIM: తొలి వన్డే విజయంతో టీమిండియా పేరిట స్పెషల్ రికార్డ్.. లిస్టులో ఇద్దరు ఆటగాళ్లు కూడా..

|

Aug 19, 2022 | 8:46 AM

హరారేలో జరిగిన తొలి వన్డేలో జింబాబ్వేను ఓడించి భారత జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. టీమిండియా వరుసగా జింబాబ్వేపై 13వ వన్డే మ్యాచ్‌లో విజయం సాధించింది.

IND vs ZIM: తొలి వన్డే విజయంతో టీమిండియా పేరిట స్పెషల్ రికార్డ్.. లిస్టులో ఇద్దరు ఆటగాళ్లు కూడా..
Zim Vs Ind 1st Odi
Follow us on

IND VS ZIM: జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. తొలుత ఆడిన జింబాబ్వే జట్టు 189 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం టీమిండియా 30.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. భారత బౌలర్ల పటిష్ట ప్రదర్శన తర్వాత ఓపెనర్ శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్ అద్భుతాలు చేశారు. గిల్ అజేయంగా 82, ధావన్ అజేయంగా 81 పరుగులు చేశారు. అంతకుముందు బౌలింగ్‌లో అక్షర్ పటేల్, ప్రసీద్ధ్ కృష్ణ, దీపక్ చాహర్ తలో మూడు వికెట్లు తీశారు. అదే సమయంలో ఈ విజయంతో కేఎల్ రాహుల్ సారథ్యంలో భారత జట్టు తన పేరిట ఓ అద్వితీయ రికార్డును సొంతం చేసుకుంది.

వరుసగా 13 మ్యాచ్‌ల్లో విజయం..

వన్డేల్లో జింబాబ్వేను భారత జట్టు వరుసగా 13వ మ్యాచ్‌లో ఓడించింది. 2013 నుంచి 2022 వరకు భారత్‌పై జింబాబ్వే ఒక్క వన్డే మ్యాచ్‌ కూడా గెలవలేదు. 2013కి ముందు కూడా భారత్ 2002-05 మధ్య వరుసగా 10 మ్యాచ్‌ల్లో జింబాబ్వేను ఓడించింది.

ఇవి కూడా చదవండి

జింబాబ్వేతో పాటు, 1988-2004 మధ్య, భారత జట్టు బంగ్లాదేశ్‌ను వరుసగా 12 వన్డేల్లో ఓడించింది. 1986-1988 వరకు భారత్ వరుసగా 11 వన్డే మ్యాచ్‌లలో న్యూజిలాండ్‌ను కూడా ఓడించింది. జింబాబ్వేతో సిరీస్‌లో భారత జట్టు మిగిలిన 2 మ్యాచ్‌లు గెలిస్తే, ఈ తిరుగులేని ఆధిక్యం 13 నుంచి 15కి పెరుగుతుంది.

జింబాబ్వేపై ధావన్ 6500 పరుగులు..

సిరీస్‌లోని మొదటి వన్డే కూడా భారత ఓపెనర్ శిఖర్ ధావన్‌కు చాలా ప్రత్యేకమైనదిగా నిలిచింది. భారత్ తరపున ధావన్ వన్డేల్లో 38వ అర్ధశతకం సాధించాడు. అతను 113 బంతుల్లో 81 పరుగులతో అర్ధ సెంచరీ చేశాడు. ధావన్ ఈ ఇన్నింగ్స్ కూడా ప్రత్యేకమైనది. ఎందుకంటే తన వన్డే కెరీర్‌లో 6500 పరుగులు పూర్తి చేశాడు. భారత్ నుంచి ఈ ఘనత సాధించిన 10వ ఆటగాడిగా ధావన్ నిలిచాడు.

ప్రసీద్ధ్ కృష్ణ, ధావన్‌ ప్రత్యేక రికార్డ్‌లు..

భారత జట్టు ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఈ ఏడాది భారతదేశం తరపున అత్యధిక వికెట్లు తీసిన రికార్డును సాధించాడు. నిజానికి, కృష్ణ 2022 సంవత్సరంలో 10 వన్డే మ్యాచ్‌లలో 18 వికెట్లు తీశాడు.

భారత్‌పై జింబాబ్వే స్పెషల్ రికార్డ్..

తొలి వన్డేలో జింబాబ్వే జట్టు ఆసక్తికరమైన రికార్డు సృష్టించింది. తొమ్మిదో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యాన్ని అందించడంతో.. భారత్‌పై తొమ్మిదో వికెట్‌కు జింబాబ్వేకు ఇదే అత్యధిక భాగస్వామ్యంగా నిలిచింది.