Yuvraj Singh: షాకిచ్చిన సౌత్‌పా.. క్రికెట్‌లోకి ‘రీఎంట్రీ’.. ఎప్పుడో తెలుసా?

|

Nov 02, 2021 | 2:03 PM

భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తన అభిమానులకు గుడ్ న్యూస్ అందించాడు. తను మరలా క్రికెట్ ఆడేందుకు సిద్ధమని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తిరిగి మైదానంలోకి వస్తానని ప్రకటించి షాక్ ఇచ్చాడు.

Yuvraj Singh: షాకిచ్చిన సౌత్‌పా.. క్రికెట్‌లోకి రీఎంట్రీ.. ఎప్పుడో తెలుసా?
Yuvraj
Follow us on

Yuvraj Singh:భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తన అభిమానులకు గుడ్ న్యూస్ అందించాడు. తను మరలా క్రికెట్ ఆడేందుకు సిద్ధమని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తిరిగి మైదానంలోకి వస్తానని ప్రకటించి షాక్ ఇచ్చాడు. ఫిబ్రవరి 2022లో తాను క్రికెట్ ఆడబోతున్నానని ప్రకటించాడు. 2019 జూన్‌లో భారత స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ విలేకరుల సమావేశంలో తన అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ సమయంలో ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ వైట్-బాల్ క్రికెట్‌లో అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే.

“దేవుడు మీ విధిని నిర్ణయిస్తాడు !! ప్రజల డిమాండ్‌పై నేను ఫిబ్రవరిలో ఆశాజనకంగా పిచ్‌లోకి వస్తాను! మీ ప్రేమకు ధన్యవాదాలు. నిజమైన అభిమాని కష్టసమయాల్లో ఉన్న జట్టుకు అండగా ఉండాలి” అని ఆయన అన్నారు.

యువరాజ్ సింగ్ 2011 ప్రపంచ కప్‌లో మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఈ టోర్నీలో బ్యాట్, బాల్ రెండింటిలోనూ అద్భుతంగా రాణించాడు. యువరాజ్ 90.50 సగటుతో 362 పరుగులు చేసి 15 వికెట్లు కూడా తీశాడు. 2011 ప్రపంచ కప్‌లో యువరాజ్ తన జీవితంలో అత్యుత్తమ క్రికెట్ ఆడాడు. అయితే 2011 ప్రపంచ కప్ ముగిసిన కొద్ది రోజుల తర్వాత యూవీకి క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.

అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత, సౌత్‌పా ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఆడాడు. అతను GT20 లీగ్‌లో టొరంటో నేషనల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అబుదాబి T10లో మరాఠా అరేబియన్స్ తరపున కూడా ఆడాడు. యువరాజ్ చివరిసారిగా మార్చి 2021లో రోడ్ సేఫ్టీ సిరీస్‌లో మైదానంలో కనిపించాడు. అయితే ఇప్పుడు మరోసారి క్రికెట్‌లోకి పునరాగమనం చేసేందుకు యువరాజ్ సింగ్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: New Zealand Tour of India: కొత్త కోచ్, టీ20 కెప్టెన్, కివీస్ సిరీస్ స్వ్కాడ్ ఎంపికలో సెలక్టర్లు బిజీ.. రెండు రోజుల్లో బీసీసీఐ నిర్ణయం

Indian Cricket Team: టీమిండియా వైఫల్యానికి ఐసీసీ, బీసీసీఐల హస్తం.. పేలవ ప్రదర్శనకు అసలు కారణాలు ఇవే..!