Viral Photo: టీమిండియా క్రికెటర్లు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నారు. 5 టెస్టుల సిరీస్‌కు సమయం చాలా ఉండడంతో.. బీసీసీఐ ఆటగాళ్లకు విశ్రాంతిని ఇచ్చింది. దీంతో ఇంగ్లండ్ లోని పలు ప్రాంతాలను తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, తాజాగా క్రికెటర్ ఇషాంత్ శర్మను మాజీ టీమిండియా అటగాడు యువరాజ్ ట్రోల్ చేశాడు. అసలు విషయానికి వస్తే.. టీమిండియా పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ గోల్ఫ్ ఆడుతున్న ఓ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అయితే ఇషాంత్ వేసుకున్న డ్రెస్‌ను ఉద్దేశిస్తూ సోషల్ మీడియా వేదికగా యువరాజ్ కామెంట్స్ చేశాడు. ఫొటోలో గోల్ఫ్ ఆడుతోన్న ఇషాంత్.. కాళ్లకు రంగు షూస్, తలకు పచ్చరంగు టోపీని ధరించాడు. వీటితో ఇషాంత్ కాస్త వింతగా కనిపించాడు. ఇక యువరాజ్’లంబూజీ నిన్ను ఇలాంటి డ్రెస్‌లో చూడలేక పోతున్నాం..కాస్త నీ గెటప్ మార్చరాదు’ అంటూ కామెంట్ చేశాడు. ఇక క్రికెట్ ప్రేమికులు ఆగుతారా.. వారు కూడా ఇషాంత్ అవతారంపై ఫన్నీగా కామెంట్స్ పెట్టారు.
ఇటీవలే న్యూజిలాండ్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇషాంత్ 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆగస్టు 4 నుంచి మొదలు కానున్న టెస్టు సిరీస్ కోసం టీమిండియా ఆటగాళ్లు సన్నద్ధం కానున్నారు. మరోవైపు ఇషాంత్ శర్మ కేవలం టెస్టు ఫార్మాట్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. టీమిండియా తరపున 100 టెస్టు మ్యాచ్‌లను పూర్తి చేసున్నాడు. ఇప్పటి వరకు 102 టెస్టులు ఆడిన ఇషాంత్ 306 వికెట్లు పడగొట్టాడు. ఇక 80 వన్డేలు ఆడిన లంబూ 115 వికెట్లు, 14 టీ20ల్లో 8 వికెట్లు పడగొట్టాడు.
Also Read:
The Hundred: ‘ద హండ్రెడ్’.. క్రికెట్‌లో సరికొత్త ఫార్మాట్ ఎంట్రీ.. రూల్స్ ఏంటో తెలుసా!
Sourav Ganguly: సౌరభ్ గంగూలీనే బెస్ట్ కెప్టెన్.. సచిన్ వికెట్‌కే నా తొలిప్రాధాన్యత: షోయబ్ అక్తర్