AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: మీరు మొరగండి.. మేం గెలుస్తాం! అభిషేక్‌ ఆటే కాదు.. మాట కూడా తూటానే!

ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా విజయం సాధించిన తర్వాత, అభిషేక్ శర్మ "యూ టాక్, వీ విన్" అంటూ ట్వీట్ చేశాడు. పాక్ బౌలర్ల వార్నింగ్స్‌కు ప్రత్యుత్తరం ఇవ్వడమే ఇందుకు కారణం. అభిషేక్ 74 పరుగులతో మ్యాచ్‌లో దూసుకుపోయాడు. ఈ విజయంతో పాక్‌పై భారత్‌కు ఇది రెండో విజయం.

IND vs PAK: మీరు మొరగండి.. మేం గెలుస్తాం! అభిషేక్‌ ఆటే కాదు.. మాట కూడా తూటానే!
ఆసియా కప్‌ 2025లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ జోరు మీద ఉన్నాడు. చివరి సూపర్ 4 గ్రూప్ మ్యాచ్‌లో శ్రీలంకపై కూడా అతను భారత్‌కు ఘనమైన ఆరంభాన్ని అందించగలిగాడు. ఈ మ్యాచ్‌లో అతను ప్రత్యేక జాబితాలో ఉన్న అనేక మంది దిగ్గజాలను అధిగమించి చరిత్ర సృష్టించాడు. అభిషేక్ శర్మ ఒకేసారి పాకిస్తాన్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలను అధిగమించాడు.
SN Pasha
|

Updated on: Sep 22, 2025 | 9:23 AM

Share

ఆసియా కప్‌ 2025లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా సూపర్‌ విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో పాక్‌పై భారత్‌కు ఇది రెండో విజయం. గ్రూప్‌ దశలో తొలుత పాక్‌ను ఓడించిన టీమిండియా, తాజాగా సూపర్‌ ఫోర్‌ దశలో రెండోసారి ఓడించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ అద్భుతమైన బ్యాటింగ్‌తో దుమ్మురేపాడు. 39 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులతో 74 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

అయితే మ్యాచ్‌ తర్వాత అభిషేక్‌ శర్మ ఒక ఇంట్రెస్టింగ్‌ ట్వీట్‌ చేశాడు. పాక్‌పై విజయం తర్వాత.. ‘యూ టాక్‌, వీ విన్‌’ అంటూ మ్యాచ్‌ గెలిచిన పిక్స్‌ పంచుకున్నాడు. అభిషేక్‌ శర్మ ఇలా ట్వీట్‌ చేయడానికి ఒక కారణం ఉంది. 172 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో టీమిండియా ఓపెనర్లు అభిషేక్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌ అద్భుతమైన స్టార్ట్‌ అందించారు. తొలి వికెట్‌కు సెంచరీ ప్లస్‌ పార్నర్‌షిప్‌ అందించారు. ఇలా టీమిండియా ఓపెనర్లు చెలరేగుతుంటే పాకిస్థాన్‌ బౌలర్లు ఏం చేయలేక.. నోటికి పనిచెప్పారు. షాహీన్‌ షా అఫ్రిదీ, హరీస్‌ రౌఫ్‌ అకారణంగా భారత ఆటగాళ్లపై నోరు పారేసుకున్నారు.

ఇది చూసి చూసి ఇక భరించలేకపోయిన అభిషేక్‌ శర్మ ఒకానొక దశలో హరీస్‌ రౌఫ్‌కు ఎదురుతిరగాడు. ఇలా పాక్‌ ఆటగాళ్లతో ఢీ అంటే ఢీ అంటూ బ్యాట్‌తో కూడా వారికి బుద్ధి చెప్పాడు. మ్యాచ్‌లో జరిగిన ఈ డ్రామా తర్వాత అభిషేక్‌ ఆ ట్వీట్‌ చేశాడు. పాక్‌ ఆటగాళ్లు మాట్లాడుతూనే ఉంటారు, మేం మ్యాచ్‌లు గెలుస్తూనే ఉంటాం అనే అర్థం వచ్చేలా ట్వీట్‌ చేశాడు. మ్యాచ్‌లో హరీస్‌ రౌఫ్‌కు వార్నింగ్‌ ఇవ్వడం, మ్యాచ్‌ తర్వాత చేసిన ట్వీట్‌ చూస్తే అభిషేక్‌ శర్మ ఆట మాత్రమే కాదు.. అతని మాట కూడా తూటానే అని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
US F1 వీసా స్లాట్‌ కోసం రూ.20 వేలు డిమాండ్.. ఇంటర్వ్యూ రద్దు
US F1 వీసా స్లాట్‌ కోసం రూ.20 వేలు డిమాండ్.. ఇంటర్వ్యూ రద్దు
వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతోన్న 'అగ్గిపెట్టె మచ్చ'..ఏమైందంటే?
వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతోన్న 'అగ్గిపెట్టె మచ్చ'..ఏమైందంటే?
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీబీఐ సోదాలు..!
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీబీఐ సోదాలు..!
గురు నక్షత్ర గోచారంతో వీరికి కొత్త అవకాశాలు, ఆర్థిక లాభాలు
గురు నక్షత్ర గోచారంతో వీరికి కొత్త అవకాశాలు, ఆర్థిక లాభాలు
టెర్మినేటర్ సీన్ రిపీట్! వేడి లావాలోకి దూకేసిన హ్యూమనాయిడ్ రోబోలు
టెర్మినేటర్ సీన్ రిపీట్! వేడి లావాలోకి దూకేసిన హ్యూమనాయిడ్ రోబోలు
ఆకాశవాణి భవన్‌ వద్ద హైటెన్షన్.. రాహుల్‌గాంధీ సహా కాంగ్రెస్ నేతల అరెస్ట్..!
ఆకాశవాణి భవన్‌ వద్ద హైటెన్షన్.. రాహుల్‌గాంధీ సహా కాంగ్రెస్ నేతల అరెస్ట్..!
బంగారం ధర 26% పతనం.. ఇదే కొనడానికి సరైన సమయమా? వేచి ఉండాలా?
బంగారం ధర 26% పతనం.. ఇదే కొనడానికి సరైన సమయమా? వేచి ఉండాలా?
అంతర్జాతీయ వేధింపుల గ్యాంగ్‌ వెనుక భారతీయుడు!
అంతర్జాతీయ వేధింపుల గ్యాంగ్‌ వెనుక భారతీయుడు!
‘కోర్టు’ హీరోయిన్ కొత్త సినిమా ట్రైలర్
‘కోర్టు’ హీరోయిన్ కొత్త సినిమా ట్రైలర్
హాయిగా నిద్రపోండి-లక్షల్లో గెలుచుకోండి! వినూత్న స్లీప్ కాంపిటీషన్
హాయిగా నిద్రపోండి-లక్షల్లో గెలుచుకోండి! వినూత్న స్లీప్ కాంపిటీషన్