Year Ender 2023: ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక పరుగుల చేసిన టాప్‌-10 బ్యాటర్లు వీరే.. అగ్రస్థానంలో ఎవరున్నారో తెలుసా?

|

Dec 24, 2023 | 9:20 PM

2023లో జరిగిన కొన్ని మధుర క్షణాలను కొంతమంది గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అందులో క్రికెట్ అభిమానులు కూడా ఉన్నారు. స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఓడిపోడం ఈ ఏడాది అత్యంత చేదు జ్ఞాపకమని చెప్పుకోవచ్చు. అయితే ప్రపంచ కప్‌ గెలవకపోయినా వ్యక్తిగతంగా పలు రికార్డులు నెలకొల్పారు టీమిండియా బ్యాటర్లు

Year Ender 2023: ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక పరుగుల చేసిన టాప్‌-10 బ్యాటర్లు వీరే.. అగ్రస్థానంలో ఎవరున్నారో తెలుసా?
Virat Kohli, Shubman Gil, Rohit Sharma
Follow us on

మరో వారం రోజుల్లో 2023 సంవత్సరానికి తెరపడనుంది. 2024కు గ్రాండ్‌గా వెల్కమ్‌ పలికేందుకు అందరూ రెడీ అవుతున్నారు. అదే సమయంలో 2023లో జరిగిన కొన్ని మధుర క్షణాలను కొంతమంది గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అందులో క్రికెట్ అభిమానులు కూడా ఉన్నారు. స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఓడిపోడం ఈ ఏడాది అత్యంత చేదు జ్ఞాపకమని చెప్పుకోవచ్చు. అయితే ప్రపంచ కప్‌ గెలవకపోయినా వ్యక్తిగతంగా పలు రికార్డులు నెలకొల్పారు టీమిండియా బ్యాటర్లు. సీనియర్‌ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు శుభ్‌ మన్‌ గిల్, ఇషాన్‌ కిషన్‌, యశస్వి జైస్వాల్‌ తదితర యువ ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లో తమదైన ముద్ర వేశారు. ఈ ఏడాది వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 3 ఆటగాళ్లు భారత క్రికెటర్లే కావడం విశేషం. అందులోనూ భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్‌కి ఈ ఏడాది చాలా ప్రత్యేకమైనది. గిల్ ఈ ఏడాది భారీగా పరుగులు చేశాడు. వన్డే క్రికెట్‌లో విరాట్ కోహ్లీ, భారత కెప్టెన్ రోహిత్ శర్మలను అధిగమించీ మరి రన్స్‌ చేశాడు. గిల్ ఈ ఏడాది మొత్తం 29 మ్యాచ్‌లు ఆడి 1584 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 9 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌ గిల్‌ కావడం విశేషం.

ఈ జాబితాలో భారత దిగ్గజం విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది మొత్తం 27 వన్డేలు ఆడిన కోహ్లీ 1377 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 8 అర్ధసెంచరీలు ఉన్నాయి, ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కూడా కోహ్లీ నిలిచాడు. ఈ జాబితాలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ మొత్తం 27 వన్డేలు ఆడి 1255 పరుగులు చేశాడు. రోహిత్ ఈ ఏడాది 2 సెంచరీలు, 9 అర్ధసెంచరీలు చేశాడు. ఇక న్యూజిలాండ్ ఆటగాడు డెరెల్ మిచెల్‌ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ సంవత్సరం ఆడిన 26 మ్యాచ్‌లు ఆడిన మిచెల్‌ 1204 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 3 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇక ఐదో స్థానంలో శ్రీలంక ఆటగాడు పతుమ్ నిస్సాంక ఉన్నాడు. ఈ ఏడాది 29 వన్డే మ్యాచుల్లో 1151 రన్స్‌ చేశాడీ లంక బ్యాటర్‌. ఇందులో 2 సెంచరీలు, 9 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఆరో ప్లేస్‌లో పాకిస్తాన్‌ స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజామ్‌, ఏడో స్థానంలో కేఎల్‌ రాహుల్, 8వ ప్లేస్‌లో ఐడెన్‌ మర్కరమ్‌, తొమ్మిదో స్థానంలో మహ్మద్‌ రిజ్వాన్‌, పదో ప్లేసులో విల్‌ యంగ్‌ ఉన్నారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..