WTC 2023 Final: డబ్ల్యూటీసీ పోరుకు భారత్, ఆస్ట్రేలియా సిద్ధం.. ఫైనల్ ఎప్పుడు, ఎక్కడ? లైవ్ స్ట్రీమింగ్ వివరాలు మీకోసం..

|

May 31, 2023 | 12:40 PM

WTC 2023 Final Live Streaming: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రికెట్ జట్టు వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పుడు 2021-23 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌లోని ఓవల్‌లో ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది.

WTC 2023 Final: డబ్ల్యూటీసీ పోరుకు భారత్, ఆస్ట్రేలియా సిద్ధం.. ఫైనల్ ఎప్పుడు, ఎక్కడ? లైవ్ స్ట్రీమింగ్ వివరాలు మీకోసం..
Wtc Final 2023 Live
Follow us on

ICC World Test Championship 2023: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రికెట్ జట్టు వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పుడు 2021-23 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌లోని ఓవల్‌లో ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. ఈ ఏడాది జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో నిలవగా, భారత్‌తో పాటు శ్రీలంక కూడా రెండో స్థానం కోసం రేసులో పాల్గొంది.

న్యూజిలాండ్ టూర్‌లో ఆడిన తొలి టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక ఓడిపోయింది. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన టెస్టు మ్యాచ్‌లో ఐదో రోజు చివరి బంతికి న్యూజిలాండ్ రెండు వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. శ్రీలంక ఓటమి నుంచి లాభపడిన భారత్.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకుంది. ఈ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది, ఎలా చూడాలో పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

WTC 2023 Final IND vs AUS: మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?

2023 జూన్ 7 నుంచి 11 వరకు భారత్, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ఇవి కూడా చదవండి

ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ రోజు వర్షం పడితే.. దానికి రిజర్వ్ డే కూడా ఉంది. ఇది 12 జూన్ 2023న నిర్వహించనున్నారు.

WTC 2023 Final IND vs AUS: భారతదేశంలో ఈ మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది.

WTC 2023 Final IND vs AUS Live Streaming: టీవీలో ప్రత్యక్ష ప్రసారం ఎలా చూడాలి?

ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్‌లో టీవీలో వీక్షించవచ్చు.

WTC 2023 Final IND vs AUS Live Streaming: మొబైల్‌లో ప్రత్యక్ష ప్రసారం ఎలా చూడాలి?

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌ను చూడొచ్చు.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టిక..

ఆస్ట్రేలియా – 68.52% పాయింట్ల శాతం, 148 పాయింట్లు.

భారతదేశం – 60.29% పాయింట్ల శాతం, 123 పాయింట్లు.

దక్షిణాఫ్రికా – 55.56% పాయింట్ల శాతం, 100 పాయింట్లు.

శ్రీలంక – 53.33% పాయింట్ల శాతం, 64 పాయింట్లు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..