WTC Final: ‘ఐపీఎల్‌లో హీరోలు.. భారత్ తరపున జీరోలు’.. తిట్టిపోస్తున్న నెటిజన్లు..

|

Jun 12, 2023 | 8:28 AM

10 ఏళ్లు గడుస్తున్నా.. ఐసీసీ ట్రోఫీ ఇంకా టీమిండియాకు కలగానే మిగిలిపోయింది. ఎప్పుడో ధోని సారధ్యంలో సొంతమైన వన్డే ప్రపంచకప్ తర్వాత ఎంతమంది కెప్టెన్లు మారినా..

WTC Final: ఐపీఎల్‌లో హీరోలు.. భారత్ తరపున జీరోలు.. తిట్టిపోస్తున్న నెటిజన్లు..
India Vs Australia
Follow us on

10 ఏళ్లు గడుస్తున్నా.. ఐసీసీ ట్రోఫీ ఇంకా టీమిండియాకు కలగానే మిగిలిపోయింది. ఎప్పుడో ధోని సారధ్యంలో సొంతమైన వన్డే ప్రపంచకప్ తర్వాత ఎంతమంది కెప్టెన్లు మారినా.. దశాబ్ద కాలంగా భారత్‌కు ఐసీసీ ట్రోఫీ అందని ద్రాక్షగా మారింది. టెస్టుల్లోనే కాదు.. వన్డేలు, టీ20లు ఎక్కడ చూసినా టీమిండియాది పేలవ ప్రదర్శనే కొనసాగుతోంది. రెండు టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌.. రెండింటిలోనూ భారత్ జట్టే ఓటమిపాలైంది. వెరిసి జట్టు సామర్ధ్యం, సెలక్షన్ కమిటీ ఎంపికలపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్ ఘోర పరాజయం పాలైంది. ఆసీస్‌కి ఏమాత్రం పోటీ ఇవ్వకుండా.. టీమిండియా బ్యాటర్లు చాప చుట్టేశారు. ఐపీఎల్ షెడ్యూల్.. ఆ వెంటనే డబ్ల్యూటీసీ ఫైనల్.. ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్‌లు లేకుండానే బరిలోకి దిగిన భారత్.. కట్ చేస్తే.. రోహిత్‌సేన మరోసారి చేతులెత్తేసింది. భారత్ జట్టు ప్రదర్శనపై క్రికెట్ అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి టీమిండియా ఫ్లాప్ షో‌కి ఐపీఎలే కారణమని తిట్టిపోస్తున్నారు. ఐపీఎల్ అంటేనే గాయాలు, సిరీస్‌లు లాంటివి గుర్తురాకుండా చించుకుని పొడిచేసే ప్లేయర్స్.. జాతీయ జట్టు తరపున ఎందుకు అదే ఇంటెన్సిటీతో ఆడలేకపోతున్నారని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

మొన్న ఐపీఎల్‌లో అదరగొట్టిన రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ, శుభ్‌మాన్ గిల్ లాంటివారు.. తాజాగా సరైన ఆటతీరు కనబరచలేకపోయారు. టాప్ ఆర్డర్ స్టార్ట్ బాగున్నప్పటికీ.. దాన్ని ట్రిపుల్ ఫిగర్‌కు మార్చుకోలేకపోయారని మండిపడుతున్నారు. టీమిండియా ప్లేయర్స్‌ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు పనిరారని.. వీళ్లు ఐపీఎల్‌కు మాత్రమే పనికొస్తారని విమర్శిస్తున్నారు. ‘ఐపీఎల్‌లో హీరోలు.. ఇండియాకు జీరోలు’ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.