Team India: కెప్టెన్లు మారినా, టీమిండియా రాత మారలేగా.. ఆ ఐసీసీ టోర్నీ నుంచి ఔట్..?

WTC Points Table: న్యూజిలాండ్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ముగిసింది. న్యూజిలాండ్ 2-0 తేడాతో సిరీస్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సిరీస్ కొత్త పాయింట్ల పట్టికలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ జాబితాలో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.

Team India: కెప్టెన్లు మారినా, టీమిండియా రాత మారలేగా.. ఆ ఐసీసీ టోర్నీ నుంచి ఔట్..?
Wtc Final

Updated on: Dec 22, 2025 | 6:23 PM

WTC Points Table: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సిరీస్‌ను న్యూజిలాండ్ శుభారంభం చేసింది. వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను కివీస్ 2-0 తేడాతో గెలుచుకుంది. ఈ విజయం తర్వాత కొత్త ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టిక కూడా విడుదలైంది. కొత్త పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆసీస్ ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడి అన్నింటిలోనూ విజయం సాధించింది. దీంతో 100 శాతం విజయ శాతంతో మొదటి స్థానాన్ని దక్కించుకుంది.

వెస్టిండీస్‌పై సిరీస్ విజయంతో న్యూజిలాండ్ రెండవ స్థానానికి చేరుకుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సిరీస్‌లో కివీస్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక డ్రాతో ఉంది. 77.780 విజయ శాతంతో WTC స్టాండింగ్స్‌లో రెండవ స్థానంలో నిలిచింది.

టీం ఇండియాను 2-0 తేడాతో ఓడించిన దక్షిణాఫ్రికా మూడో స్థానంలో ఉంది. ఆఫ్రికన్ జట్టు ఇప్పటివరకు 4 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి ఈ నాలుగు మ్యాచ్‌ల్లో 3 గెలిచింది. దీంతో దక్షిణాఫ్రికా 75% విజయ శాతంతో మూడో స్థానాన్ని దక్కించుకుంది.

ఇవి కూడా చదవండి

అదేవిధంగా, శ్రీలంక నాల్గవ స్థానంలో ఉంది. శ్రీలంక జట్టు కూడా ఇప్పటివరకు 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడింది. ఈ మ్యాచ్‌లలో ఒక విజయం, ఒక డ్రాతో 66.67 శాతం పాయింట్లు సంపాదించింది.

ఈసారి పాకిస్తాన్ ఐదవ స్థానంలో ఉంది. ఆడిన రెండు మ్యాచ్‌లలో పాకిస్తాన్ జట్టు ఒక మ్యాచ్ గెలిచి, ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. 50 శాతం విజయ శాతంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సిరీస్ పాయింట్ల పట్టికలో ఐదవ స్థానానికి చేరుకుంది.

ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 4 గెలిచి, 1 డ్రాగా ముగించిన టీం ఇండియా మిగిలిన 4 మ్యాచ్‌ల్లో కూడా దారుణమైన ఓటమిని చవిచూసింది. ఈ విజయాలు, ఓటములతో 48.150 శాతం సాధించిన భారత జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సిరీస్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పడిపోయింది.

యాషెస్ సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్ 27.080 శాతంతో 7వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 16.67 శాతంతో 8వ స్థానంలో ఉంది. ఏడు మ్యాచ్‌ల్లో ఏడు మ్యాచ్‌ల్లో ఓడిన వెస్టిండీస్ 4.170 శాతంతో 9వ స్థానంలో ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..