WTC 2021-23: టెస్ట్ టీమ్‌లో రిషభ్ పంత్‌కి స్థానం.. రోహిత్, కోహ్లీ లేకుండానే ముందుకు.. ప్రకటించిన క్రికెట్ బోర్డ్..

|

Jun 05, 2023 | 4:47 PM

WTC Final 2023, IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జూన్ 7 నుంచి 11 వరకు ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. లండన్‌లోని ఓవల్ మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌లో గెలవాలని ఇప్పటికే ఇరుజట్లు ప్రాక్టీస్..

WTC 2021-23: టెస్ట్ టీమ్‌లో రిషభ్ పంత్‌కి స్థానం.. రోహిత్, కోహ్లీ లేకుండానే ముందుకు.. ప్రకటించిన క్రికెట్ బోర్డ్..
Cricket Australia's WTC Team of the Tournament
Follow us on

WTC Final 2023, IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జూన్ 7 నుంచి 11 వరకు ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. లండన్‌లోని ఓవల్ మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌లో గెలవాలని ఇప్పటికే ఇరుజట్లు ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇక గతంలో న్యూజిలాండ్‌తో జరిగిన డబ్య్లూటీసి ఫైనల్ మ్యాచ్‌లో భారత్ తరఫున రిషభ్ పంత్ కూడా ఆడాడు. కానీ కారు ప్రమాదం జరిగిన కారణంగా పంత్ క్రికెట్‌కి దూరమయ్యాడు. ఈ కారణంగానే ఆస్ట్రేలియాతో జరిగే ఫైనల్ మ్యాచ్‌‌ కోసం కూడా అతను ఎంపిక కాలేదు. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన డబ్ల్యూటీసీ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌‌లో రిషభ్ పంత్‌కి స్థానం దక్కింది.

ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ టోర్నీ(డబ్ల్యూటీసీ 2021-2023)లో వివిధ దేశాల తరఫున రాణించిన ఆటగాళ్లతో తమ బెస్ట్ ఎలెవన్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా రూపొందించింది. ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఆ క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన డబ్ల్యూటీసీ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌‌లో మొత్తం ముగ్గురు భారత ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీ, శుభమన్‌ గిల్‌, చతేశ్వర్ పుజారాలలో ఒక్కరు కూడా లేరు. రిషభ్ పంత్‌తో పాటు స్పిన్ కోటాలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాకు భారత్ నుంచి ఆస్ట్రేలియా ప్రకటించిన జట్టులో అవకాశం దక్కింది.

కాగా, 2022 డిసెంబర్‌ చివరిలో కారు ప్రమాదంలో గాయపడటానికి ముందు టెస్టుల్లో మెరుగైన బ్యాటింగ్‌తో అలరించిన రిషభ్‌ పంత్‌‌ను తమ టీమ్ వికెట్ కీపర్‌గా క్రికెట్ ఆస్ట్రేలియా ఎంచుకుంది. ఇంకా క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించిన డబ్ల్యూటీసీ టీమ్‌ ఆఫ్ ది టోర్నమెంట్‌ జట్టులో పాట్‌ కమిన్స్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. ఇంకా టీమ్ ఓపెనర్లుగా ఉస్మాన్‌ ఖవాజా(ఆస్ట్రేలియా), డిమిత్ కరుణరత్నె(శ్రీలంక) ఉన్నారు. మూడో స్థానంలో బాబర్ అజామ్(పాకిస్థాన్‌), నాల్గో స్థానంలో జో రూట్(ఇంగ్లాండ్).. ట్రావిస్ హెడ్‌(ఆస్ట్రేలియా), రవీంద్ర జడేజా(భారత్) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అలాగే వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్(భారత్).. ఆ తర్వాత రవిచంద్రన్ ఆశ్విన్(భారత్) స్పిన్నర్‌గా 8వ స్థానంలో ఉన్నాడు. స్పీడ్‌స్టర్లుగా పాట్ కమిన్స్‌(ఆస్ట్రేలియా), జేమ్స్‌ అండర్సన్(ఇంగ్లాండ్), కగిసో రబాడ(సౌతాఫ్రికా) వరుస స్థానాల్లో అవకాశం లభించింది.

ఇవి కూడా చదవండి

క్రికెట్‌ ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్

ఉస్మాన్ ఖవాజా, డిమిత్ కరుణరత్నె, బాబర్ అజామ్, జో రూట్, ట్రావిస్ హెడ్, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, పాట్ కమిన్స్‌(కెప్టెన్), జేమ్స్ అండర్సన్, కగిసో రబాడ

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..