
WPL 2024, DCW vs RCBW: ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ (DCW) ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2024 17వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCBW)తో తలపడుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ సమయంలో బాలీవుడ్ నటి కరీనా కపూర్ కూడా మైదానంలో కనిపించింది. నేటి మ్యాచ్‌లో RCBW మూడు మార్పులతో మైదానంలోకి వచ్చింది. ఢిల్లీ జట్టులో ఒక్క మార్పు చోటు చేసుకుంది.
An electrifying match starting 🔜
ఇవి కూడా చదవండిAre you ready ⁇
Live 💻📱https://t.co/626J6jany9#TATAWPL | #DCvRCB pic.twitter.com/My9NenyIef
— Women’s Premier League (WPL) (@wplt20) March 10, 2024
WPL 2024లో DCW ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడింది. 4 మ్యాచ్‌ల్లో గెలిచింది. పాయింట్ల పట్టికలో ఆ జట్టు 8 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మరోవైపు ఈ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ జట్టు 6 మ్యాచ్‌లు ఆడింది. స్మృతి మంధాన సారథ్యంలోని టీమిండియా 3 గెలిచి 3 మ్యాచ్‌ల్లో ఓడింది. పాయింట్ల పట్టికలో RCBW మూడో స్థానంలో ఉంది.
ఢిల్లీ క్యాపిటల్స్: మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, అలిస్ క్యాప్సే, జెమిమా రోడ్రిగ్స్, మారిజాన్ కాప్, జెస్ జోనాసెన్, అరుంధతీ రెడ్డి, తానియా భాటియా (వికెట్ కీపర్), శిఖా పాండే, రాధా యాదవ్, టిటాస్ సాధు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, ఎల్లీస్ పెర్రీ, రిచా ఘోష్ (కీపర్), దిశా కస్సట్, జార్జియా వేర్‌హామ్, సోఫీ మోలినెక్స్, శ్రేయంక పాటిల్, ఆశా శోభన, శ్రద్ధా పోఖార్కర్, రేణుకా ఠాకూర్ సింగ్.
ఢిల్లీ క్యాపిటల్స్ (DCW) వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCBW) మధ్య హెడ్ టు హెడ్ గణాంకాల గురించి మాట్లాడితే, DCW పైచేయి ఉంది. రెండు జట్లు ఇప్పటి వరకు 3 సార్లు తలపడగా, ప్రతిసారీ DCW విజయం సాధించింది. ఈ సీజన్‌లోని 7వ మ్యాచ్‌లో DCW 25 పరుగుల తేడాతో RCBWని ఓడించింది. WPL 2023లో ఇరు జట్లు రెండు సార్లు తలపడ్డాయి. WPL 2023 రెండో మ్యాచ్‌లో DCW 60 పరుగుల తేడాతో RCBWని ఓడించింది. అలాగే, గత సీజన్‌లో 11వ మ్యాచ్‌లో DCW 6 వికెట్ల తేడాతో RCBWని ఓడించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..