ఫైనల్ బెర్త్ కోసం గట్టి పోటీ.. రేసులో టీమిండియా, ఇంగ్లాండ్.. గెలుపు వరిచేది ఎవరికో.?
World Test Championship: కరోనా కారణంగా క్రికెట్ ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా సిరీస్‌ను రద్దు చేసుకోవడంతో న్యూజిలాండ్ టీమ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్...
World Test Championship: కరోనా కారణంగా క్రికెట్ ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా సిరీస్‌ను రద్దు చేసుకోవడంతో న్యూజిలాండ్ టీమ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకుంది. దీనితో ఆట మరింత రసవత్తరంగా మారింది. మరో బెర్త్ కోసం రెండు మేటి జట్లు పోటిపడుతున్నాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరాలంటే.. టీమిండియా, ఇంగ్లాండ్‌కు స్వదేశంలో జరగబోయే సిరీస్ చాలా కీలకంగా మారనుంది. ఈ సిరీస్‌లో భారత్ 2-0, 2-1, 3-0, 3-1, 4-0తో ఇంగ్లాండ్‌పై విజయం సాధిస్తే.. సరాసరి ఫైనల్ చేరుకుంటుంది.
అలా కాకుండా ఒకవేళ ఇంగ్లాండ్ చేతుల్లో 0-3, 1-3, 0-4తో ఓడిపోతే ఇంగ్లీష్ జట్టు టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఫైనల్ చేరుతుంది. స్వదేశంలో జరుగుతోంది కాబట్టి ఇండియా హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అటు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, పేస్ బౌలర్ ఇషాంత్ శర్మలు జట్టులోకి చేరడంతో.. ఇంగ్లాండ్‌కు గట్టి పోటి ఇవ్వనుంది. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 5వ తేదీ నుంచి చెన్నై వేదికగా టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో భారత్, ఇంగ్లాండ్ మొత్తం 4 టెస్టులు ఆడనున్నాయి.
Also Read:
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా దిగొచ్చిన బంగారం ధరలు.. వరుసగా రెండో రోజు ఎంతంటే.!
ప్రభాస్ ‘ఆదిపురుష్’ సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. చిత్ర యూనిట్ తప్పిన పెను ముప్పు..