Rohit Sharma: ‘పక్కకు తప్పుకోండమ్మా’.. రోహిత్‌ దంచుడుకు దిగ్గజాల రికార్డుల బద్దలు.. సచిన్‌, గేల్‌తో సహా..

|

Oct 12, 2023 | 12:40 PM

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఢిల్లీ పిచ్‌పై చితక్కొట్టాడు. ఆఫ్ఘన్‌ బౌలర్లను ఒక ఆటాడుకున్నాడు. చాలా రోజుల తర్వాత రోహిత్‌లో విశ్వరూపాన్ని బయటకు తీశాడు. 84 బంతుల్లోనే 16 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 131 పరుగులు చేసి భారత్ ఘన విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ఇన్నింగ్స్‌తో హిట్‌మ్యాన్‌ పలు రికార్డులను బ్రేక్‌ చేశాడు.

Rohit Sharma: పక్కకు తప్పుకోండమ్మా.. రోహిత్‌ దంచుడుకు దిగ్గజాల రికార్డుల బద్దలు.. సచిన్‌, గేల్‌తో సహా..
రోహిత్ శర్మ ఇప్పటికి 40-45 సెంచరీలు చేసి ఉండేవాడు. కానీ, సెంచరీలను అంతగా పట్టించుకోడు. అతను తన కోసం కాకుండా జట్టు కోసం ఆడతాడు.ప్రస్తుత ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతను ఇప్పటివరకు అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో కూడా ఇలాగే దూసుకపోవాలని తెలిపాడు.
Follow us on

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఢిల్లీ పిచ్‌పై చితక్కొట్టాడు. ఆఫ్ఘన్‌ బౌలర్లను ఒక ఆటాడుకున్నాడు. చాలా రోజుల తర్వాత రోహిత్‌లో విశ్వరూపాన్ని బయటకు తీశాడు. 84 బంతుల్లోనే 16 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 131 పరుగులు చేసి భారత్ ఘన విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ఇన్నింగ్స్‌తో హిట్‌మ్యాన్‌ పలు రికార్డులను బ్రేక్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేయడం ద్వారా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు రోహిత్ శర్మ. వన్డే ప్రపంచకప్ చరిత్రలో సచిన్‌ ఆరు సెంచరీలు బాదాడు. అఫ్గాన్‌పై సెంచరీతో రోహిత్‌ శర్మ.. సచిన్‌ రికార్డును బద్దలు కొట్టి ప్రపంచకప్‌లో అత్యధికంగా ఏడు సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. సచిన్‌ ఆరు ప్రపంచకప్‌లు ఆడి ఆరు సెంచరీలు బాదగా.. రోహిత్ తన మూడో ప్రపంచకప్‌లోనే ఈ ఘనత సాధించాడు. ఇక ‘యూనివర్సల్‌ బాస్‌’ వెస్టిండీస్‌ వెటరన్ క్రికెటర్‌ క్రిస్‌ గేల్ రికార్డును కూడా హిట్‌మ్యాన్‌ బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. క్రిస్ గేల్ 553 సిక్సులతో అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ 551 సిక్స్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు. అఫ్గాన్‌పై భారత కెప్టెన్‌ ఐదు సిక్సర్లు బాది మొత్తం 556 సిక్సులతో గేల్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇంకా ఇంట్రెస్టింగ్‌ ఏంటంటే.. రోహిత్‌ రికార్డు ఇప్పట్లో బద్ధలయ్యే అవకాశం లేదు. ఎందుకంటే అతడికి దరిదాపుల్లో ఏ ఆటగాడూ లేడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ 63 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకుని ప్రపంచకప్‌లో వేగవంతమైన సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు రోహిత్‌.

అంతేకాదు ప్రపంచకప్‌లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా వార్నర్‌తో సమంగా నిలిచాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ 272 పరుగులు చేసింది. టార్గెట్‌ చేజింగ్‌లో మనోళ్లకు అడ్డేలేకుండా పోయింది. టార్గెట్‌ను కేవలం 35ఓవర్లలోనే చేజ్‌ చేశారు. ఇషాన్‌ 47 రన్స్‌ చేస్తే.. కోహ్లీ 55, అయ్యర్‌ 25 పరుగులు చేశారు. కాగా భారత్‌ తన తర్వాతి మ్యాచ్‌లో పటిష్ఠమైన పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా శనివారం (అక్టోబర్‌ 13)న ఈ హై ఓల్టేజ్‌ మ్యాచ్‌ జరగనుంది.

ఇవి కూడా చదవండి

సచిన్, గేల్, వార్నర్ లను దాటి..

రికార్డుల రారాజుగా రోహిత్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..