
India vs Australia: ఆతిథ్య జట్టు భారత్ అక్టోబర్ 8న ఆస్ట్రేలియా (India vs Australia) తో తన వన్డే ప్రపంచ కప్ 2023 (ODI World Cup 2023) ప్రయాణాన్ని ప్రారంభించనుంది. రెండు జట్ల మధ్య పోరు చెన్నై ఎంఏ. చిదంబరం స్టేడియంలో నిర్వహించనున్నారు. అయితే మ్యాచ్‌కు ముందు భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) అస్వస్థతకు గురికావడంతో భారత జట్టులో ఆందోళ పెరిగింది. అయితే, గత మూడు వన్డేల సిరీస్‌లో కంగారూలను ఓడించిన రోహిత్ శర్మ జట్టుకు గిల్ అందుబాటులో లేకపోవడం చాలా సమస్యగా మారే అవకాశాలు ఉన్నాయి. అయితే, గిల్ గైర్హాజరీలో ఇషాన్ కిషన్ (Ishan Kishan) కూడా మంచి ఫామ్‌లో ఉన్న మరో ఓపెనర్ కూడా అందుబాటులో ఉన్నాడు. ఈ మ్యాచ్ చెన్నైలో జరుగుతున్నందున, పిచ్ ఎలా ఉండనుంది, మ్యాచ్ జరిగే రోజు వర్షం కురిసే అవకాశం ఉందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం..
చిదంబరం స్టేడియం ఇద్దరికీ అనుకూలంగా ఉండే పిచ్. ఇది బ్యాట్స్‌మన్స్‌తోపాటు బౌలర్‌లకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వికెట్ సాధారణంగా పొడిగా ఉంటుంది. స్పిన్నర్లకు మరింత సహాయం చేస్తుంది. మ్యాచ్ జరుగుతున్న కొద్దీ పిచ్ కాస్త నెమ్మదించింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన జట్టుకు పరుగులు చేయడం కాస్త కష్టంగా మారుతుంది. అందుకే చాలా జట్లు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంటాయి.
వాతావరణ సూచన ప్రకారం ఆదివారం చెన్నైలో గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ , కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్ గా ఉండి ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మ్యాచ్‌లో 20% వర్షం కురిసే అవకాశం ఉందని, మేఘావృతమైన వాతావరణం ఉంటుందని తెలుస్తోంది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం లేదని సమాచారం. దీంతో ప్రేక్షకులు వర్షం గురించి ఆందోళన చెందకుండా మ్యాచ్‌ను పూర్తిగా వీక్షించవచ్చు.
టీమ్ ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమ్మీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.
ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, కెమెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుషాగ్నే, మిచ్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్ స్టార్క్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..