భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కోసం ఇరుదేశాల అభిమానులే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తుంటారు. గత కొన్నేళ్ళుగా ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే తలపడుతున్న దాయాది జట్ల పోరును వీక్షించేందుకు అభిమానులు ఎంతైనా వెచ్చించేందుకు వెనుకాడడంలేదు. భారత్ , పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం మధ్యాహ్నం మ్యాచ్ జరగనున్న ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియం(మాంచెస్టర్) సీట్ల సామర్థ్యం 20వేలుకాగా.. టికెట్లు అమ్మకానికి ఉంచిన గంటల వ్యవధిలోనే అమ్ముడుపోయాయి. దీంతో.. బ్లాక్‌లో కొనేందుకు అభిమానులు ప్రయత్నిస్తుండటాన్ని గమనించిన వయాగోగో.కామ్ అనే వెబ్‌సైట్.. టికెట్లు దక్కించుకున్న వారి వద్ద నుంచి కొనుగోలు చేసి.. తిరిగి అధిక ధరకి అమ్ముతున్నట్లు తెలుస్తోంది.
మ్యాచ్ టికెట్లను దక్కించుకున్న దాదాపు 480 మంది అభిమానులు ఇప్పటికే వయాగోగో వెబ్‌సైట్‌ని సంప్రదించి తమ టికెట్లను అమ్ముకోగా.. వాటిని కేటగిరిని బట్టి రూ. 20,000 నుంచి 60,000కి వెబ్‌సైట్ మళ్లీ అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ప్లాటినమ్ కేటగిరీ టికెట్ ధర అత్యధికంగా రూ. 62,610కి అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌తో ప్రపంచకప్‌లో చివరిగా ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ భారత్ గెలుపొందిన విషయం విదితమే.
Hello Manchester ??#CWC19 pic.twitter.com/t4nkqob2Ua
— BCCI (@BCCI) June 15, 2019