అతడి గురించి టెన్షన్ పడకండి: కోహ్లీ సేనకు సచిన్ సలహా

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తోన్న భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌కు సమయం దగ్గరపడుతోంది. దాయాది టీంల మధ్య జరుగుతున్న ఈ పోరు ఫైనల్ కాకపోయినప్పటికీ.. ఎవరు గెలుస్తారు..? అన్న ఉత్సుకత గంట గంటకు పెరుగుతోంది. మరోవైపు ఈ ఒత్తిడిని అధిగమించేందుకు భారత క్రికెటర్లు కూడా సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ ప్రత్యర్థులను ఎలా ఎదుర్కోవాలా..? అని సన్నద్ధమవుతున్నారు. అయితే టీమిండియా ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. పాకిస్తాన్ బౌలర్ మహ్మద్‌ అమిర్‌‌ను ఎదుర్కొనే విషయంలో కాస్త ఆలోచిస్తోంది. ప్రస్తుతం మంచి […]

అతడి గురించి టెన్షన్ పడకండి: కోహ్లీ సేనకు సచిన్ సలహా
Follow us

| Edited By:

Updated on: Jun 15, 2019 | 4:09 PM

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తోన్న భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌కు సమయం దగ్గరపడుతోంది. దాయాది టీంల మధ్య జరుగుతున్న ఈ పోరు ఫైనల్ కాకపోయినప్పటికీ.. ఎవరు గెలుస్తారు..? అన్న ఉత్సుకత గంట గంటకు పెరుగుతోంది. మరోవైపు ఈ ఒత్తిడిని అధిగమించేందుకు భారత క్రికెటర్లు కూడా సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ ప్రత్యర్థులను ఎలా ఎదుర్కోవాలా..? అని సన్నద్ధమవుతున్నారు. అయితే టీమిండియా ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. పాకిస్తాన్ బౌలర్ మహ్మద్‌ అమిర్‌‌ను ఎదుర్కొనే విషయంలో కాస్త ఆలోచిస్తోంది.

ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న అమిర్.. ఈ వరల్డ్‌కప్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలో 10వికెట్లను పడగొట్టి వికెట్ టేకర్‌గా లిస్ట్‌లో టాప్‌లో ఉన్నాడు. మరోవైపు 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోపీలో పాకిస్తాన్ చేతిలో ఇండియా ఘోర పరాభవం అవ్వడంలో అమిర్ కీలక పాత్ర పోషించాడు. దీంతో ఈ సారి అతడిని ఎలా ఎదుర్కోవాలా..? అంటూ టీమిండియా పేసర్లు ప్రత్యేక శ్రద్ధను పెడుతున్నారు. ఈ నేపథ్యంలో అమిర్ విషయంలో కోహ్లీ సేనకు క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ సలహాలు ఇచ్చారు.

అమిర్ వేసే బాల్‌లను ఎదుర్కొనే విషయంలో నెగిటివిటీ అవసరం లేవు. ఈ విషయంలో టీమిండియా పేసర్లు పాజిటివ్‌గా ఉండండి. అందుకోసం ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు అంటూ సచిన్ పేర్కొన్నారు. అంతేకాకుండా రోహిత్, కోహ్లీ ఎక్కువ సేపు ఫాంలో ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు. ఎందుకంటే పాక్ బౌలర్లు కోహ్లీ, రోహిత్‌లనే ఎక్కువగా టార్గెట్ చేస్తారని.. అందుకే ఇన్నింగ్స్ ప్రారంభించినప్పుడు ఆ ఇద్దరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సచిన్ తెలిపారు. ముఖ్యంగా పాక్ బౌలర్లైన అమిర్, వహాబ్ రియాజ్‌లు.. కోహ్లీ, రోహిత్‌లను త్వరగా ఔట్ చేసేందుకే ప్రయత్నిస్తారని ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనా టీమిండియా అన్ని విభాగాల్లోనూ పాజిటివ్‌గా ఉండాలని.. ఆట ఆడేటప్పుడు బాడీ లాంగ్వేజ్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సలహా ఇచ్చారు.

Latest Articles
'ఇక ప్రతి సోమవారం నలిగిన బట్టలు మాత్రమే ధరించండి..' CSIR హుకూం!
'ఇక ప్రతి సోమవారం నలిగిన బట్టలు మాత్రమే ధరించండి..' CSIR హుకూం!
సమ్మోహనంగా సాగిన సంస్కృత కవి సమ్మేళనం
సమ్మోహనంగా సాగిన సంస్కృత కవి సమ్మేళనం
బ్యాటింగ్‌లో బాహుబలి.. బౌలింగ్‌లో భల్లాలదేవ.. ఈ ప్లేయర్ అరవీర.!
బ్యాటింగ్‌లో బాహుబలి.. బౌలింగ్‌లో భల్లాలదేవ.. ఈ ప్లేయర్ అరవీర.!
బాబీ డియోల్ డాన్స్ అచ్చు దించేసిన హీరోయిన్.. 32 ఏళ్ల క్రితమే...
బాబీ డియోల్ డాన్స్ అచ్చు దించేసిన హీరోయిన్.. 32 ఏళ్ల క్రితమే...
దీపికతో పెళ్లి ఫొటోలను డిలీట్ చేసిన రణ్‌వీర్ సింగ్.. కారణమిదేనా?
దీపికతో పెళ్లి ఫొటోలను డిలీట్ చేసిన రణ్‌వీర్ సింగ్.. కారణమిదేనా?
810 కిలోల బంగారం తీసుకెళ్తున్న వాహనం రోడ్డుపై బోల్తా.. ఒక్కసారిగా
810 కిలోల బంగారం తీసుకెళ్తున్న వాహనం రోడ్డుపై బోల్తా.. ఒక్కసారిగా
రెండు చేతులూ లేకపోయినా.. బాధ్యతగా ఓటు వేసిన అంకిత్
రెండు చేతులూ లేకపోయినా.. బాధ్యతగా ఓటు వేసిన అంకిత్
మండే ఎండల్లో కూలింగ్ న్యూస్.. ఏపీకి వచ్చే 2 రోజులు వర్షాలు..
మండే ఎండల్లో కూలింగ్ న్యూస్.. ఏపీకి వచ్చే 2 రోజులు వర్షాలు..
గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా.? ఈ సమ్యలున్నాయో చెక్‌ చేసుకోండి
గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా.? ఈ సమ్యలున్నాయో చెక్‌ చేసుకోండి
RRతో మ్యాచ్..టాస్ ఓడిన ఢిల్లీ.. జట్టులో టీమిండియా సీనియర్ ప్లేయర్
RRతో మ్యాచ్..టాస్ ఓడిన ఢిల్లీ.. జట్టులో టీమిండియా సీనియర్ ప్లేయర్