WCL 2024: వరుసగా మూడు ఓటములు.. కట్ చేస్తే.. సెమీస్‌కు చేరిన భారత్.. ఛాంపియన్స్ నెక్స్ట్ టార్గెట్ ఇదే

|

Jul 11, 2024 | 6:48 PM

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాజీ దిగ్గజ క్రికెటర్లు ఎందరో పాల్గొంటున్నారు. ఈ లీగ్‌లోని 15వ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఛాంపియన్స్, ఇండియా ఛాంపియన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ 54 పరుగుల తేడాతో..

WCL 2024: వరుసగా మూడు ఓటములు.. కట్ చేస్తే.. సెమీస్‌కు చేరిన భారత్.. ఛాంపియన్స్ నెక్స్ట్ టార్గెట్ ఇదే
Team India
Follow us on

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాజీ దిగ్గజ క్రికెటర్లు ఎందరో పాల్గొంటున్నారు. ఈ లీగ్‌లోని 15వ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఛాంపియన్స్, ఇండియా ఛాంపియన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ 54 పరుగుల తేడాతో భారత ఛాంపియన్స్‌ను ఓడించింది. ఈ ఓటమితో భారత ఛాంపియన్స్ టోర్నీలో వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. అయితే ఈ హ్యాట్రిక్ ఓటములను ఎదుర్కొన్నప్పటికీ, భారత ఛాంపియన్స్ జట్టు సెమీస్‌కు చేరుకుంది. టోర్నీలో పాకిస్థాన్, ఆస్ట్రేలియాతో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన భారత ఛాంపియన్స్.. ఇప్పుడు దక్షిణాఫ్రికాపై కూడా ఓడింది. అయితే, అత్యుత్తమ రన్ రేట్ ఆధారంగా భారత ఛాంపియన్స్ సెమీ ఫైనల్స్‌లో చోటు దక్కించుకుంది. భారత్, పాకిస్థాన్‌తో పాటు ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లు కూడా సెమీఫైనల్‌ పోరులో తలబడనున్నాయి.

ఇది చదవండి: నిద్రపోయే భంగిమను బట్టి మీ వ్యక్తిత్వాన్ని చెప్పేయొచ్చు..! ఎలాగో తెల్సా

ఇక సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జూలై 12న జరగనున్నాయి. సెమీ-ఫైనల్ రౌండ్‌లో, వెస్టిండీస్ ఛాంపియన్ జట్టు, ఛాంపియన్ పాకిస్థాన్ జట్టుతో తలపడగా.. ఛాంపియన్ అయిన భారత్ జట్టు, ఛాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ రెండు మ్యాచ్‌లు జూలై 12న జరగనున్నాయి. వెస్టిండీస్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. ఆస్ట్రేలియా ఛాంపియన్స్, ఇండియా ఛాంపియన్స్ మధ్య మ్యాచ్ రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది. సెమీఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన జట్లు నేరుగా ఫైనల్‌లోకి ప్రవేశించనున్నాయి. ఫైనల్ మ్యాచ్ జూలై 13న జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

ఇక భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ చూస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 210 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత ఛాంపియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసి 54 పరుగుల తేడాతో ఓడిపోయింది. దక్షిణాఫ్రికా తరఫున జాక్వెస్ స్నిమాన్ 43 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 73 పరుగులు చేయగా, రిచర్డ్ లెవీ 25 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 60 పరుగులు చేశాడు.

ఇది చదవండి: ‘హాయ్ ఫ్రెండ్స్.! ఈరోజు మా ఫస్ట్ నైట్’.. వీడియో షేర్ చేసిన కొత్త జంట.. ఇదేం బూతు పురాణం

ఈ మ్యాచ్‌లోనూ భారత్ ఛాంపియన్స్ బౌలర్లు యధావిధిగా పరుగులు ధారాళంగా ఇచ్చారు. ధావల్ కులకర్ణి 4 ఓవర్లలో 47 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. వినయ్ కుమార్ 3 ఓవర్లలో 32 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. కేవలం హర్భజన్ సింగ్ ఒక్కడే.. 4 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. యువరాజ్ సింగ్ 2 ఓవర్లలో 36 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 211 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఛాంపియన్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి. రాబిన్ ఉతప్ప 10 బంతుల్లో 23 పరుగులు చేయగా, నమన్ ఓజా 7 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేయగలిగాడు. సురేశ్ రైనా 24 బంతుల్లో 21 పరుగులు చేయగా, అంబటి రాయుడు 6 బంతుల్లో 2 పరుగులు చేశాడు. యువరాజ్ సింగ్ 5 బంతుల్లో 5 పరుగులు చేయగా, ఇర్ఫాన్ పఠాన్ 21 బంతుల్లో 35 పరుగులు చేశాడు. చివరి వరకు బ్యాటింగ్ చేసిన యూసుఫ్ పఠాన్ 44 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయంగా 54 పరుగులు చేశాడు. అయినా జట్టును మాత్రం విజయపథంలో నడిపించలేకపోయాడు.

ఇది చదవండి: ఆడది కాదు.. ఆడపులి.! ఒంటిచేత్తో భారీ కొండచిలువను ఎలా ఉడుంపట్టు పట్టిందో చూస్తే

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..