WWC 2022 Points Table: టీమిండియా సెమీఫైనల్ చేరేనా.. ఒకటే బెర్త్.. మూడు టీంలు.. ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయంటే?

|

Mar 26, 2022 | 2:42 PM

Women's World Cup 2022 Points Table: రేపు రెండు కీలక మ్యాచ్‌ల ఫలితాలతో సెమీఫైనల్ విజేతలెవరో తేలిపోనుంది. అయితే టీమిండియాకు మాత్రం ఈ బెర్త్ అంత ఈజీగా దొరికేలా లేదు.

WWC 2022 Points Table: టీమిండియా సెమీఫైనల్ చేరేనా.. ఒకటే బెర్త్.. మూడు టీంలు.. ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయంటే?
Icc Womens World Cup 2022 Team India Semi Final Chances
Follow us on

న్యూజిలాండ్‌, పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత, ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2022(ICC Women’s World Cup 2022) పాయింట్ల సంఖ్య ఆసక్తికర మలుపు తిరిగింది. మార్చి 27న టీమిండియా ఓడిపోతే, ఇంటిబాట పట్టాల్సిందే. క్రైస్ట్‌చర్చ్‌లో భారత్‌(India).. వెల్లింగ్‌టన్ పిచ్‌పై ఇంగ్లండ్‌(England)ఎంతో కీలకంగా మారింది. ఎందుకంటే ఈ కీలక మ్యాచులో ఓడిపోతే చాలా నష్టపోవాల్సి వస్తుంది. సెమీ ఫైనల్ రేసు నుంచి న్యూజిలాండ్ ఇంకా పూర్తిగా బయటపడలేదు. పాకిస్థాన్‌పై విజయం సాధించిన తర్వాత రన్ రేట్ బాగా పెరిగింది. ఇక ప్రస్తుతం మార్చి 27న మ్యాచుల ఫలితంపై ఆధారపడి సెమీఫైనల్ రేసులో ఎవరుండనున్నారో తెలుస్తోంది.

పాయింట్ల పట్టికను పరిశీలిస్తే లీగ్ దశలో 7 మ్యాచ్‌లు ఆడిన ఆస్ట్రేలియా 7 గెలిచి సెమీఫైనల్‌కు చేరి అగ్రస్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 9 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఈ జట్టు సెమీఫైనల్‌కు కూడా వెళ్లింది. వెస్టిండీస్‌కు 7 మ్యాచ్‌లలో 7 పాయింట్లు ఉన్నాయి. సెమీ ఫైనల్‌కు చేరుకున్నట్లే.

స్థానం ఒకటి, టీంలు మూడు.. మార్చి 27న తీర్పు..

ప్రస్తుతం సెమీ-ఫైనల్‌లో చేరే నాలుగో జట్టు గురించే ఈ గందరగోళం అంతా. ఉన్న ప్లేస్ ఒకటి.. అయితే ఈ స్థానానికి పోటీదార్లు మాత్రం ముగ్గురు. వారిలో ఇద్దరు బలమైన ప్రదర్శన చేస్తున్నారు. అయితే ఎవరి అదృష్టం ఎలా ఉందనేది, రేపు తెలియనుంది. ఆ స్థానాన్ని ఎవరు ఆక్రమిస్తారో మార్చి 27న ఇంగ్లండ్, బంగ్లాదేశ్ మ్యాచ్‌తో పాటు భారత్-దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ రిజల్ట్ తెలియజేస్తుంది.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ 5వ స్థానంలో, ఇంగ్లండ్ 4వ స్థానంలో కొనసాగుతున్నాయి. మరోవైపు న్యూజిలాండ్ జట్టు ఆరో స్థానంలో ఉంది. మూడు జట్లూ చేరో 6 పాయింట్లతో ఉన్నాయి. రన్ రేట్ మాత్రమే తేడా. ఇంగ్లండ్ రన్ రేట్ భారత్ కంటే మెరుగ్గా ఉంది. ఇక న్యూజిలాండ్ కంటే భారత్ రన్ రేట్ మెరుగ్గా ఉంది. అదే సమయంలో, న్యూజిలాండ్ లీగ్ దశలో మొత్తం 7 మ్యాచ్‌లు ఆడింది. అదే సమయంలో మార్చి 27న భారత్, ఇంగ్లండ్ చివరి మ్యాచ్ ఆడనున్నాయి.

భారత్ సెమీ-ఫైనల్ చేరాలంటే..

సెమీఫైనల్‌కు వెళ్లాలంటే భారత్ ఏం చేయాలో తెలిసిపోయింది. అంటే టీమిండియా మొదట దక్షిణాఫ్రికాను ఓడించాలి. అదే మ్యాచ్‌లో రన్ రేట్‌ను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అదే సమయంలో, బంగ్లాదేశ్ టీం ఇంగ్లండ్‌ను మరింత మెరుగ్గా ఓడించాలని టీమిండియా ఆశించాలి.

Also Read: IPL 2022: క్రికెటర్ లవర్స్‌కి జియో గుడ్ న్యూస్‌.. ఐపీఎల్‌ మ్యాచ్‌లను వీక్షించేందుకు స్పెషల్‌ రీచార్జ్‌ ప్లాన్స్‌..

Viral Video: కోహ్లీ అంటే అల్లాటప్పా కాదు బాబాయ్.. చాలా షేడ్స్ ఉన్నాయ్.. వైరల్ అవున్న షాకింగ్ వీడియో..!