ఇలాంటి క్యాచ్‌లు చాలా అరుదుగా కనిపిస్తాయి. అది కూడా మహిళల క్రికెట్(Women’s World Cup 2022)లో చాలా తక్కువగా చూస్తుంటాం. ప్రస్తుత మహిళల ప్రపంచకప్‌లో ఎన్నో అద్భుతమైన క్యాచ్‌లు ఇప్పటికే చూశాం. కానీ, ఇది మాత్రం.. వేరే లెవల్ క్యాచ్ అంటూ ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2022లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ మిగ్నాన్ డు ప్రీజ్(Mignon Du Preeze) అందించిన క్యాచ్‌ను పట్టుకున్న ఆస్ట్రేలియా ఫీల్డర్ ఉత్సాహానికి అవధులే లేవు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ యాష్లే గార్డనర్(Ashleigh Gardner) చేసిన ప్రయత్నం అద్భుతం అంటూ తోటి ఆటగాళ్లు కూడా మెచ్చుకుంటున్నారు. ఇందులో గార్డనర్ క్యాచ్ ముందు వరుసలో ఉంటుందనడంలో సందేహం లేదు.
ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా 300 ప్లస్ స్కోరు దిశగా కదులుతున్నట్లు కనిపించింది. కానీ, గార్డనర్ ఈ క్యాచ్ అందుకోవడంతో కేవలం 271 పరుగులకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించింది. మిగ్నాన్ డు ప్రీజ్ కేవలం 14 పరుగుల వద్ద పెవిలియన్ చేరింది.
ఒంటి చేత్తో ఆసీస్ ప్లేయర్ అద్భుత క్యాచ్..
దక్షిణాఫ్రికా బ్యాటర్ మిగ్నాన్ డు ప్రీజ్ ఫాస్ట్ బ్యాటింగ్‌కు పేరుగాంచింది. జట్టు స్కోరు బోర్డును పెంచేందుకు 46వ ఓవర్ 5వ బంతికి భారీ షాట్ ఆడింది. కానీ, ఈ షాట్ బౌండరీ చేరకముందే గార్డనర్ చేతికి చిక్కింది. గాలిలోకి ఎగిరి బంతిని ఒంటి చేత్తో క్యాచ్ పట్టుకుంది. అది కూడా వెనకకు కదులుతూ అద్భుత క్యాచ్ అందుకుంది.
ఈ మ్యాచ్‌లో ఆష్లే గార్డనర్ ఈ క్యాచ్ పట్టడమే కాకుండా బౌలింగ్‌లోనూ సత్తా చాటింది. 10 ఓవర్లలో 52 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ను తీసింది. ఈ వికెట్ వాల్వార్ట్‌కి చెందింది. కాసేపటికి వికెట్‌పై స్థిరపడి ఉంటే దక్షిణాఫ్రికా 300 పరుగుల స్కోరును చేరుకునేది. గార్డనర్ 90 పరుగుల వద్ద వాల్వార్ట్‌ను పెవిలియన్ చేర్చింది.
Ash Gardner what a catch! ? #CWC22 pic.twitter.com/kW2LGXJ9LF
— Chloe-Amanda Bailey (@ChloeAmandaB) March 22, 2022
Also Read: Women’s World Cup 2022: భారత్‌కు కలిసొచ్చిన పాకిస్తాన్ విజయం.. సెమీస్ రేసుకు మరింత చేరువగా..
Watch Video: గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో సూపర్బ్ క్యాచ్.. చూశారంటే షాకే.. వైరల్ వీడియో