WIPL 2023: జట్ల వేలం నుంచి ప్రైజ్ మనీ వరకు.. మహిళల ఐపీఎల్ లీగ్‌లో కీలక విషయాలు మీకోసం..

|

Jan 24, 2023 | 8:11 AM

బీసీసీఐ ఇప్పటి వరకు మీడియా హక్కులను మాత్రమే అధికారికంగా వెల్లడించింది. అదే సమయంలో టీమ్‌లకు టెండర్లు కూడా పూర్తయ్యాయి. పురుషుల ఐపీఎల్‌లోని చాలా ఫ్రాంచైజీలు కూడా ఈ లీగ్‌పై ఆసక్తి కనబరిచాయి.

WIPL 2023: జట్ల వేలం నుంచి ప్రైజ్ మనీ వరకు.. మహిళల ఐపీఎల్ లీగ్‌లో కీలక విషయాలు మీకోసం..
Womens Ipl
Follow us on

గత కొన్నేళ్లుగా, అభిమానులు, అనుభవజ్ఞులు, మహిళా ఆటగాళ్లు పురుషుల మాదిరిగానే మహిళలకు టీ20 లీగ్‌ను నిర్వహించాలని బీసీసీఐని డిమాండ్ చేస్తున్నారు. మహిళల టీ20 ఛాలెంజ్ ప్రారంభమైంది. కానీ, అది ఐపీఎల్ స్థాయి మాత్రం కాదు. మహిళల ఐపీఎల్ తొలి సీజన్‌ను 2023లో నిర్వహించనున్నట్టు గత ఏడాది బీసీసీఐ ఎట్టకేలకు ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి బీసీసీఐ అందుకు సన్నాహాలు ప్రారంభించింది.

బీసీసీఐ ఇప్పటి వరకు మీడియా హక్కులను మాత్రమే అధికారికంగా వెల్లడించింది. అదే సమయంలో టీమ్‌లకు టెండర్లు కూడా పూర్తయ్యాయి. పురుషుల ఐపీఎల్‌లోని చాలా ఫ్రాంచైజీలు కూడా ఈ లీగ్‌పై ఆసక్తి కనబరిచాయి. లీగ్ తేదీలకు సంబంధించి చాలా అప్‌డేట్‌లు కూడా వచ్చాయి.

మార్చిలో మహిళల ఐపీఎల్‌..

ఫిబ్రవరిలో జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్ తర్వాత మహిళల ఐపీఎల్ నిర్వహించనున్నారు. తొలి సీజన్‌లో ఆరు జట్లతో 22 మ్యాచ్‌లు ఆడనున్నట్టు చెబుతున్నారు. లీగ్ మార్చిలో ప్రారంభమవుతుంది. అయితే దాని ఫైనల్ పురుషుల ఐపీఎల్ కంటే ముందు జరగనుంది. తొలి సీజన్‌లో అన్ని మ్యాచ్‌లు ముంబైలో నిర్వహించవచ్చని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మీడియా హక్కులను సొంతం చేసుకున్న వయాకామ్ 18 మీడియా..

మహిళల ఐపీఎల్ మీడియా హక్కులను వయాకామ్ 18 కొనుగోలు చేసినట్లు బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ఐదేళ్లలో అత్యధికంగా రూ.951 కోట్ల బిడ్‌ వేశారు. సోనీ, డిస్నీ హాట్‌స్టార్ కూడా మీడియా హక్కుల కోసం వేలం వేశాయి. ముంబైలోని క్రికెట్ బోర్డు ప్రధాన కార్యాలయంలో టీ20 లీగ్ కోసం వేలం జరిగింది.

ఫిబ్రవరిలో ఆటగాళ్ల వేలం..

క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, టోర్నమెంట్ కోసం ఆటగాళ్ల వేలం ఫిబ్రవరిలో నిర్వహించనున్నారు. పేర్ల నమోదుకు జనవరి 26 సాయంత్రం 5 గంటల వరకు బీసీసీఐ గడువు విధించింది. క్యాప్డ్ ప్లేయర్ కోసం రూ. 50 లక్షలు, రూ. 40 లక్షలు, రూ. 30 లక్షలుగా మూడు ప్రైస్ కేటగిరీలు ఉంచారు. అదే సమయంలో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లకు రూ. 20 లక్షలు, రూ. 10 లక్షల ధరల్లో కేటగిరీలు ఉంచారు. అయితే, ఇందులో మహిళల ఐపీఎల్‌కు బదులు మహిళల టీ20 లీగ్ అని రాశారు. దీన్నిబట్టి లీగ్‌కి పేరు వచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

లీగ్ ప్రైజ్ మనీ..

మహిళల ఐపీఎల్ తొలి సీజన్ ప్రైజ్ మనీ రూ.12 కోట్లు ఉంటుందని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. అదే సమయంలో రన్నరప్‌కు రూ. 3 కోట్లు ఇచ్చే అవకాశం ఉంది. మూడో స్థానంలో నిలిచిన జట్టు రూ. కోటి రూపాయలు ఇవ్వనున్నారు. అయితే దీనిపై బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

వేలంలో 30 కంపెనీలు..

ఈ నెలాఖరులోగా జట్లకు వేలం నిర్వహించాల్సి ఉంది. జట్లను కొనుగోలు చేసేందుకు 30కి పైగా కంపెనీలు ఐదు కోట్ల రూపాయలకు బిడ్ పత్రాలను కొనుగోలు చేశాయి. వీటిలో పురుషుల ఐపీఎల్ జట్లను కలిగి ఉన్న 10 కంపెనీలు ఉన్నాయి. అదానీ గ్రూప్, టొరెంట్ గ్రూప్, హల్దీరామ్ ప్రభుజీ, కాప్రీ గ్లోబల్, కోటక్, ఆదిత్య బిర్లా గ్రూప్ కూడా జట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపాయి. 2021లో రెండు కొత్త పురుషుల ఐపీఎల్ జట్లను కొనుగోలు చేయడంలో విఫలమైన కంపెనీలు కూడా వీటిలో ఉన్నాయి. ఐపీఎల్ జట్లలో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టును కొనుగోలు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపవచ్చు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..