న్యూజిలాండ్‌లో ప్లంకెట్ షీల్డ్ ట్రోఫీ ప్రారంభమైంది. ఇది న్యూజిలాండ్ క్రికెట్ ప్రధాన టోర్నమెంట్లలో ఒకటిగా పేరుగాంచింది. ఈ టోర్నీలో పటిష్ట ఆటతీరు కనబరిచి పలువురు ఆటగాళ్లు జాతీయ జట్టులోకి వచ్చారు. అయితే, ప్రస్తుతం ఒటాగో వాల్ట్స్ వర్సెస్ ఆక్లాండ్ ఏసెస్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఒక ఆటగాడు తన తెలివితో అద్భుతమైన క్యాచ్ పట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ క్యాచ్‌ని చూస్తే మీరు కూడా షాక్ అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్యాచ్ కోసం అద్భుతంగా డైవ్ చేసిన ఈ ఆటగాడు.. మైదానంలో చిరుత కంటే వేగంతో ఎంతో తెలివిగా అడుగులు వేసి, బ్యాటర్ క షాక్ ఇచ్చాడు.
ఒటాగో జట్టు బ్యాటింగ్ చేస్తోంది. విల్ సోమర్‌విల్లే బౌలింగ్ చేస్తున్నాడు. అతని ముందు డేల్ నాథన్ ఫిలిప్స్ ఉన్నాడు. ఆఫ్ స్టంప్‌లో ఫిలిప్స్ స్వీప్ షాట్ ఆడాడు. బ్యాట్స్‌మన్ స్వీప్ ఆడేందుకు పొజిషన్ తీసుకుంటుండగా, ఫస్ట్ స్లిప్ వద్ద నిలబడిన ఫీల్డర్ విల్ ఓడోనెల్ లెగ్ స్లిప్ వైపు పరుగెత్తడంతో బంతి అక్కడికి వచ్చింది. ఆపై తన ఎడమవైపు పరుగెత్తిన డోనెల్ డైవ్‌తో అద్భుత క్యాచ్‌ని పట్టి ఫిలిప్స్‌ను పెవిలియన్‌కు పంపాడు.
ఈ క్యాచ్ చూసిన బ్యాట్స్‌మెన్ ఆశ్చర్యపోయాడు. ఇది ఎలా జరిగిందో బ్యాటర్ కు అర్థం కాలేదు. కొంత సేపు క్రీజులోనే నిలబడి మరీ బ్యాట్ పట్టుకుని పెవిలియన్ వైపు నడిచాడు.
ఈ మ్యాచ్‌లో ఒటాగో తొలుత బ్యాటింగ్ చేసినా పెద్ద స్కోరు చేయలేకపోయింది. జట్టు మొత్తం 261 పరుగులకు ఆలౌటైంది. థోర్న్ పార్క్స్ అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. 81 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను ఒక సిక్స్, ఐదు ఫోర్లు బాదాడు. ఫిలిప్స్ 45 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. 102 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు.