Ruturaj Gaikwad: రుతురాజ్ గైక్వాడ్‌పై చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ప్రశంసలు.. అద్భుతాలు చేస్తాడని వ్యాఖ్యలు..

|

Jan 01, 2022 | 3:08 PM

దక్షిణాఫ్రికాతో జరగబోయే వన్డేలకు ఎంపికైన రుతురాజ్ గైక్వాడ్‌పై చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ప్రశంసలు కురిపించారు.

Ruturaj Gaikwad: రుతురాజ్ గైక్వాడ్‌పై చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ప్రశంసలు.. అద్భుతాలు చేస్తాడని వ్యాఖ్యలు..
Ruturaj
Follow us on

దక్షిణాఫ్రికాతో జరగబోయే వన్డేలకు ఎంపికైన రుతురాజ్ గైక్వాడ్‌పై చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ప్రశంసలు కురిపించారు. మహారాష్ట్ర బ్యాటర్ జాతీయ జట్టుకు “అద్భుతాలు చేస్తాడని” చెప్పాడు. భారత జట్టు దక్షిణాఫ్రికాతో జనవరి 19, 21, 23 తేదీల్లో వరుసగా పార్ల్, కేప్ టౌన్‌లో మూడు వన్డేలు ఆడనుంది. ఈ వన్డేలకు చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ ప్యానెల్ శుక్రవారం జట్టును ఎంపిక చేసింది. ” అతనికి సరైన సమయంలో అవకాశం వచ్చింది. అతను టీ20 జట్టులో ఉన్నాడు. అతను ODI జట్టులో కూడా ఉన్నాడు.” అని విలేకరుల సమావేశంలో శర్మ అన్నాడు. పూణేకు చెందిన 24 ఏళ్ల రుతురాజ్, 2021 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 635 పరుగులు చేసి చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్‎లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

” మేము రుతురాజ్‎ను ఎంపిక చేసాము. ఇప్పుడు అతను XIలో ఎప్పుడు ఆడగలడు, ఎలా ముందుకు సాగాలి అనే దానిపై మేము సమన్వయం చేస్తాము. అతను న్యూజిలాండ్‌తో జరిగిన T20 జట్టులో కూడా ఉన్నాడు. అతను ఇప్పుడు ODIలో ఉన్నాడు,” అని చెప్పాడు. రుతురాజ్ గైక్వాడ్‌ IPL తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో కూడా తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు. ఐదు మ్యాచ్‎ల్లో 603 పరుగులు సాధించాడు. ఓ మ్యాచ్‎లో అత్యధికందా 168 పరుగులు చేశాడు. అతను గత జూలైలో కొలంబోలో శ్రీలంకపై టీ20I అరంగేట్రం చేశాడు.

Read Also.. Happy New Year 2022: టీ20 ప్రపంచకప్‌.. ఆసియాకప్‌.. ఈ ఏడాది టీమిండియా ఆడే మ్యాచ్ లివే..