Today Match Prediction of DC vs KKR: ఐపీఎల్ ద్వితీయార్ధంలో సరిసమానమైన రెండు జట్లు టోర్నమెంట్‌లో 41 వ మ్యాచ్‌లో పరస్పరం తలపడనున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ టీంల మధ్య మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ టీం 8 విజయాలతో 16 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు కోల్‌కతా టీం 4 విజయాలతో 8 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. రెండో దశలో ఇప్పటి వరకు ఢిల్లీ టీం రెండు మ్యాచులాడి రెండిట్లో గెలుపొందింది. హ్యాట్రిక్ విజయం కోసం ఎదరుచూస్తోంది. మరోవైపు కోల్‌కతా టీం మూడు మ్యాచులు ఆడి రెండు విజయాలు సాధించింది.
ఎప్పుడు: KKR vs DC, సెప్టెంబర్ 28, 2021, మధ్యాహ్నం 3:30 గంటలకు
ఎక్కడ: షార్జా క్రికెట్ స్టేడియం, షార్జా (Sharjah Cricket Stadium, Sharjah)
లైవ్ స్ట్రీమింగ్ వివరాలు (Where and How to Watch)
టీవీ – స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్
లైవ్ స్ట్రీమింగ్ – డిస్నీ+హాట్‌స్టార్
KKR vs DC హెడ్-టు-హెడ్
ఇప్పటి వరకు కోల్‌కతా నైట్ రైడర్స్ టీం ఢిల్లీ క్యాపిటల్స్‌తో 27 మ్యాచులు ఆడారు. ఇందులో కోల్‌కతా నైట్ రైడర్స్ 14, ఢిల్లీ క్యాపిటల్స్ 12 మ్యాచుల్లో విజయం సాధించారు. ఒక మ్యాచులో ఫలితం తేలలేదు.
టోర్నమెంట్ మొదటి లెగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కొనసాగించిన జోరునే రెండో దశలోనూ కొనసాగిస్తోంది. ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా ఉంది. అలాగే బౌలర్లు కూడా బంతితో రాణించడంతో వరుస విజయాలు సొంతం చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి రిషబ్ పంత్ నేతృత్వంలోని జట్టు ఎలాంటి తప్పులు చేయడం లేదు. శ్రేయస్ అయ్యర్ తిరిగి రావడంతో ఢిల్లీ జట్టు మరింత బలపడింది.
అయ్యర్ ఢిల్లీ క్యాపిటల్స్ (DC)సెటప్‌లో తాను అంతర్భాగమని ఐపీఎల్ ఫేజ్ 2లో జరిగిన రెండు మ్యాచ్‌లలో నిరూపించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును 8 వికెట్ల తేడాతో ఓడించడంలో కీలక పాత్ర పోషించి 41 బంతుల్లో 47 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయ్యర్ ఆ తర్వాత మరో విన్నింగ్ మ్యాచ్ ఆడాడు. రాజస్థాన్ రాయల్స్‌పై 43 పరుగులు సాధించి జట్టు సునాయాసంగా 33 పరుగులు తేడాతో విజయం సాధించేందుకు సహాయపడ్డాడు.
అన్రిచ్ నార్ట్జే వేగవంతమైన బంతులను సంధిస్తూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. రెండో దశలో జరిగిన 2 మ్యాచ్‌లలో కుడి చేతి వాటం పేసర్ 4 వికెట్లు పడగొట్టాడు. అలాగే ఐపీఎల్ ఫేజ్ 2 లో అతను వేసిన 8 ఓవర్లలో నార్ట్జే కేవలం 30 పరుగులు మాత్రమే ఇవ్వడం గమనార్హం.
యూఏఈలో రెండు మ్యాచ్‌లలో కెప్టెన్ రిషబ్ పంత్ కీలక పరుగులను అందించాడు. ధావన్ కూడా మంచి టచ్‌లో ఉన్నాడు. దీంతో ప్రస్తుతానికి ఢిల్లీ క్యాంపు మంచి ఉత్సాహంతో దూసుకపోతోంది.
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వెంకటేశ్ అయ్యర్ రూపంలో ఐపీఎల్ ఫేజ్ 2 లో సరికొత్త యువ బ్యాట్స్‌మెన్‌ను దొరకబుచ్చుకుంది. 26 ఏళ్ల లెఫ్ట్ హ్యాండర్ ఇప్పటివరకు కేవలం 3 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. అతను బ్యాట్‌తో విలువైన పరుగులు సాధిస్తూ జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. యూఏఈలో అయ్యర్ 3 మ్యాచ్‌ల్లో 112 పరుగులు చేశాడు. 155.55 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేస్తూ ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నాడు. రెండవ దశలో ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ 2 మ్యాచులు గెలిచింది.
అయ్యర్‌తో పాటు, రాహుల్ త్రిపాఠి కూడా కేకేఆర్‌కు మంచి భాగస్వామ్యాలు అందిస్తున్నాడు. ఫేజ్ 2 లో ఆడిన 2 ఇన్నింగ్స్‌లలో 119 పరుగులు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో జరిగిన మ్యాచులో కేకేఆర్ టీం 2 వికెట్ల తేడాతో ఓడిపోయారు. చివరి బంతి వరకు కేకేఆర్ టీం పోరాడింది.
చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయినప్పటికీ కేకేఆర్ జట్టు పెద్దగా ఆందోళన చెందడం లేదు. కాబట్టి మరో బ్లాక్ బస్టర్ మ్యాచ్ మనకోసం ఎదురుచూస్తోంది. ఐపీఎల్ ఫేజ్ 2 లో ఢిల్లీ క్యాపిటల్స్ మొదటిసారి ఓడిపోతుందా, లేదా రిషబ్ పంత్ సేన యూఏఈ లెగ్‌లో హ్యాట్రిక్ విజయాలు సాధిస్తారా? అనేది చూడాలి.
పిచ్:
షార్జాలో తక్కువ బౌండరీలు ఉన్నప్పటికీ, రన్-స్కోరింగ్ అంత సులభం కాదు. పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మధ్య జరిగిన మ్యాచ్‌లో బంతి బ్యాట్స్‌మన్‌పైకి దూసుకొచ్చినట్లు మనం గమనించొచ్చు. పిచ్ ఉపరితలం నెమ్మదిగా ఉంది. మైదానం చిన్నదే అయినా బౌండరీలు సాధించలేకపోవడానకి కారణం ఇదే. అయితే క్రీజులో బ్యాట్స్‌మెన్స్ కుదురుకుంటే పరుగులు సాధించడం అంత తేలికేం కాదు.
కోల్‌కతా నైట్ రైడర్స్
చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఆండ్రీ రస్సెల్ గాయపడ్డాడు. ఢిల్లీతో జరిగే మ్యాచులో ఆడేది అనుమానంగా ఉంది. ఒకవేళ అతను మైదానం తీసుకోకపోతే, అతని స్థానంలో బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ జట్టులోకి వస్తాడు. మిగిలిన లైనప్ అలాగే ఉంటుంది.
కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ XI అంచనా: శుభ్మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, షకీబ్ అల్ హసన్/ఆండ్రీ రస్సెల్, నితీష్ రాణా, ఇయోన్ మోర్గాన్ (కెప్టెన్), దినేష్ కార్తీక్ (కీపర్), సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి
ఢిల్లీ క్యాపిటల్స్
కేకేఆర్‌తో మ్యాచ్ కోసం ఢిల్లీ కాపిటల్స్ సేమ్ టీంతోనే బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ XI అంచనా: పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్, కీపర్), లలిత్ యాదవ్, షిమ్రాన్ హెట్మీర్, అక్సర్ పటేల్, ఆర్ అశ్విన్, కగిసో రబాడా, అన్రిచ్ నార్ట్జే, అవేష్ ఖాన్
W̶h̶a̶t̶ ̶h̶a̶p̶p̶e̶n̶s̶ ̶i̶n̶ ̶A̶b̶u̶ ̶D̶h̶a̶b̶i̶,̶ ̶s̶t̶a̶y̶s̶ ̶i̶n̶ ̶A̶b̶u̶ ̶D̶h̶a̶b̶i̶
Give us a ? if you can’t wait to see this same record-breaking form of our DC bowlers against KKR in Sharjah ?#YehHaiNayiDilli #IPL2021 #KKRvDC pic.twitter.com/n6gwXlSn20
— Delhi Capitals (@DelhiCapitals) September 27, 2021
Also Read: IPL 2021, SRH vs RR: హైదరాబాద్ టార్గెట్ 165.. 143 స్ట్రైక్‌రేట్‌తో హాఫ్ సెంచరీ చేసిన శాంసన్
5 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ.. బౌలర్లపై బౌండరీలతో దాడి.. అమెరికాలో అలజడి రేపిన ఇండియన్ ప్లేయర్