AFG vs NAM T20 World Cup 2021 Match Prediction: టీ20 ప్రపంచకప్ 2021లో 27వ మ్యాచ్‌లో భాగంగా ఆఫ్గనిస్తాన్ వర్సెస్ నమీబియా జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లూ తమ మునుపటి మ్యాచ్‌లలో విరుద్ధమైన ఫలితాల నేపథ్యంలో ఈ పోటీలోకి ప్రవేశించనున్నాయి.
ఎప్పుడు: ఆఫ్గనిస్తాన్ vs నమీబియా, సూపర్ 12, గ్రూప్ 2, మధ్యాహ్నం 03:30 గంటలకు
ఎక్కడ: షేక్ జాయెద్ స్టేడియం, అబు దుబయ్
T20I హెడ్ టు హెడ్: ఆఫ్గనిస్తాన్ వర్సెస్ నమీబియా ఇంతవరకు ఒకదానితో ఒకటి టీ20ఐలో తలపడలేదు.
లైవ్: స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్ స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు.
ఆఫ్గనిస్తాన్ టీం గత మ్యాచ్లో పాకిస్థాన్‌తో ఓడిపోయింది. ఈ మ్యాచులో ఆఫ్ఘాన్ 20 ఓవర్ల కోటాలో 6 వికెట్లు నష్టపోయి 147 పరుగులు సాధించింది. ఓదశలో జట్టు 76 పరుగులకే 6 వికెట్లు కోల్పోయినా.. కెప్టెన్ మహ్మద్ నబీ, గుల్బాదిన్ నైబ్ అద్బుత భాగస్వామ్యం అందించి పోరాడే స్కోర్‌ను అందించారు.
నబీ-నైబ్ ద్వయం 7వ వికెట్‌కు 71 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 140 పరుగుల మార్కును అధిగమించింది. అయితే, ఆసిఫ్ అలీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు.
వాస్తవానికి, పాకిస్థాన్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ వరకు, ఆఫ్ఘనిస్థాన్‌కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చివరి 2 ఓవర్లలో పాకిస్థాన్‌కు 24 పరుగులు అవసరం. అయితే ఆ తర్వాత కరీం జనత్ వేసిన 19వ ఓవర్‌లో ఆసిఫ్ అలీ 4 సిక్సర్లు బాది పాకిస్థాన్‌కు విజయాన్ని అందించాడు.
నమీబియా తమ మునుపటి మ్యాచ్‌లో స్కాట్‌లాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి, ఆత్మవిశ్వాసంతో ఈ ఘర్షణలోకి ప్రవేశిస్తుంది. స్కాట్లాండ్ 109/8 పరుగులే సాధించింది. నమీబియా జట్టు మరో 5 బంతులు మిగిలి ఉండగానే మ్యాచును ముగించింది.
నమీబియా తరఫున జేజే స్మిత్ అత్యధిక స్కోరు సాధించాడు. టోర్నమెంట్‌లోని సూపర్ 12 దశల్లో నమీబియా విజయవంతమైన నోట్‌తో తమ ప్రచారాన్ని ప్రారంభించడంతో కుడిచేతి వాటం ఆటగాడు 23 బంతుల్లో 32* పరుగులు చేశాడు.
పిచ్, పరిస్థితులు:
అబుదాబిలో ఛేజింగ్ చేసేందుకే జట్లు ఆసక్తి చూపిస్తాయి. ఈ టోర్నమెంట్‌లో ఈ పిచ్‌పై ఆడిన 7 ఎన్‌కౌంటర్లలో రెండవ సారి బ్యాటింగ్ చేసిన జట్టు 6 సార్లు విజయాలు సాధించాయి. స్పిన్నర్లకు ఈ పిచ్ బాగానే కలిసొస్తుంది.
ఆఫ్ఘనిస్తాన్:
నమీబియా జట్టుతో జరిగే పోరులో ఆఫ్ఘనిస్తాన్ ఎలాంటి మార్పులేని ప్లేయింగ్ XIతో బరిలోకి దిగనుంది.
ఆఫ్ఘనిస్తాన్ ప్లేయింగ్ XI అంచనా: హజ్రతుల్లా జజాయ్, మహ్మద్ షాజాద్ (కీపర్), రహ్మానుల్లా గుర్బాజ్, అస్గర్ ఆఫ్ఘన్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ (కెప్టెన్), గుల్బాదిన్ నాయబ్, రషీద్ ఖాన్, కరీం జనత్, నవీన్-ఉల్-హక్, ముజీబ్ ఉర్ రహ్మాన్
నమీబియా:
ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మ్యాచులో నమీబియా ప్లేయింగ్ XIలో కొన్ని మార్పులు చేసేలా కనిపిస్తోంది.
నమీబియా ప్లేయింగ్ XI అంచనా: క్రెయిగ్ విలియమ్స్, మైఖేల్ వాన్ లింగేన్, జేన్ గ్రీన్ (కీపర్), గెర్హార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్), డేవిడ్ వైస్, జేజే స్మిట్, జాన్ ఫ్రైలింక్, పిక్కీ యా ఫ్రాన్స్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, రూబెన్ ట్రంపెల్‌మాన్, బెర్నార్డ్ స్కోల్ట్జ్