IPL 2025: ఢిల్లీకి షాకిచ్చిన పంత్.. మెగా వేలంలోకి ఎంట్రీ.. పోటీకి సిద్ధమైన మూడు జట్లు?

|

Oct 24, 2024 | 10:44 AM

IPL 2025 Rishabh Pant: ఐపీఎల్ మెగా వేలంలో రిషబ్ పంత్ కనిపిస్తే, చాలా ఫ్రాంచైజీలు అతని కోసం పోటీ పడేందుకు సిద్ధమయ్యాయి. ఎందుకంటే, పంత్ వికెట్ కీపర్ కం మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్. అలాగే, కెప్టెన్ స్థానాన్ని కూడా భర్తీ చేయగలడు. అందుకే రిషబ్ పంత్‌పై అన్ని ఫ్రాంచైజీల చూపు పడేందుకు కారణమైంది.

1 / 6
IPL 2025: ఐపీఎల్ ప్లేయర్స్ రిటైన్ డేట్ సమీపిస్తోంది. ఈ క్రమంలో ఓ కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. దీని ప్రకారం, రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. అంటే త్వరలో జరగనున్న మెగా వేలంలో పంత్ కనిపించాలని నిర్ణయించుకున్నాడట.

2 / 6
అయితే, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి రిషబ్ పంత్ ఎందుకు వైదొలగేందుకు సిద్ధమయ్యారనేది ప్రశ్నగా మారింది. ఈ ప్రశ్నకు ప్రస్తుత సమాధానం ఏమిటంటే, పంత్‌కి కొన్ని ఫ్రాంచైజీల నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయంట. ఎడమచేతి వాటం ఆటగాడుపై దృష్టి సారించిన టాప్ ఫ్రాంచైజీలు చెన్నై సూపర్ కింగ్స్ అని తెలుస్తోంది.

3 / 6
ఐపీఎల్ మెగా వేలం వార్తల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ రిషబ్ పంత్‌తో చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. మహేంద్ర సింగ్ ధోనీ వారసుడిగా అతనిని తీసుకోవాలని CSK ఆసక్తిగా ఉంది. కాబట్టి మెగా వేలంలో పంత్ కనిపిస్తాడని అంటున్నారు.

4 / 6
ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వచ్చిన తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు టార్గెట్ లిస్ట్‌లో రిషబ్ పంత్ కూడా చేరినట్లు వార్తలు వస్తున్నాయి. అంటే సీఎస్‌కే, ఆర్‌సీబీ కూడా రిషబ్ పంత్‌పై కన్నేసి ఉంచాయి.

5 / 6
మరోవైపు పంజాబ్ కింగ్స్ కూడా కొత్త కెప్టెన్ కోసం వెతుకుతోంది. ఇక్కడ పంజాబ్ జట్టు కొత్త కోచ్‌గా రికీ పాంటింగ్ నియమితులయ్యారు. ఇంతకుముందు, పాంటింగ్ కోచింగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు పంత్ నాయకత్వం వహించడం గమనార్హం. పంత్ మెగా వేలానికి వస్తాడని పంజాబ్ కింగ్స్ కూడా ఎదురుచూస్తుందనడం అబద్ధం కాదు.

6 / 6
అందుకే, మెగా వేలంలో రిషబ్ పంత్ కనిపిస్తే.. మూడు ఫ్రాంచైజీల మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, చివరికి పంటర్ పంత్ ఏ జట్టులోకి వస్తాడో చూడాలి.