IND vs NZ: నేడు ఏం జరుగబోతుంది? భారత్ ఓడిపోతే WTC ఫైనల్‌ రేసులో ఉండదా?

నేడు వాంఖడే స్టేడియంలో జరిగే మూడోవ రోజు మ్యాచ్ క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతుంది. న్యూజిలాండ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత్ 143/9 పరుగుల వద్ద కట్టడి చేసింది. ఇంకా ఒక్క వికెట్ ఉంది. వాస్తవానికి ఈ వేదికపై 150 పరుగులు ఛేదించడం కూడా చాలా కష్టం..భారత్‌కు ఈ మ్యాచ్ చావో రేవో మ్యాచ్ అని చెప్పాలి. ఒకవేళ భారత్ ఈ మ్యాచ్‌లో ఓడిపోతే ఏం జరుగుతుంది? WTC రేసులో భారత్ ఉండదా?

IND vs NZ: నేడు ఏం జరుగబోతుంది? భారత్ ఓడిపోతే WTC ఫైనల్‌ రేసులో ఉండదా?
Ind Vs Nz 3rd Test

Updated on: Nov 03, 2024 | 7:09 AM

సిరీస్‌ను వైట్‌వాష్ చేయాలని ప్రయత్నిస్తున్న కీవీస్‌కు భారత్ అడ్డుకట్ట వేసింది. న్యూజిలాండ్‌ను 9 వికెట్లకు 143 పరుగుల వద్ద టీమిండియా కట్టడి చేసింది. రెండు రోజుల్లోనే 29 వికెట్లు కోల్పోయిన ఈ ముంబాయి పిచ్‌పై బారత్ గెలువడం కూడా అంత ఈజీ ఏం కాదు.. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు తడబడ్డారు. శుభ్‌మన్ గిల్(90), రిషబ్ పంత్( 60)లు రాణించి భారత్ పరువును కాపాడారు. అయితే వాషింగ్టన్ సుందర్ 36 బంతుల్లో 38 పరుగులు చేసి వెనుదిరిగాడు. నేడు మూడోవ రోజు న్యూజిలాండ్‌తో జరుగనున్న మూడో టెస్టు మ్యాచ్‌లో ఏం జరుగుతుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 2వ రోజు ఆట ముగిసే సరికి 143 పరుగుల అధిక్యంలో న్యూజిలాండ్ ఉంది. ఇంకా ఒక్కటే వికెట్ ఉంది. వాంఖడే స్టేడియంలో 150 పరుగులు సాధించడం కూడా చాలా కష్టం.. దీంతో టీమిండియాకి ఇది గట్టి సవాలే అని చెప్పాలి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌ రేసులో ఉండాలంటే భారత్ ఈ మ్యాచ్ ఎట్టి పరిస్థితులోనైనా గెలిచి తీరాల్సిందే. ఈ వాంఖడే స్టేడియంలో దక్షిణాఫ్రికా భారత్‌పై 2000లో భారత్‌పై 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన రికార్డు ఉంది.

వాంఖడే స్టేడియంలో అత్యధిక పరుగుల ఛేజింగ్‌లు ఇవే..

దక్షిణాఫ్రికా 164/6 vs భారతదేశం (2000)

ఇంగ్లండ్ 98/0 vs భారతదేశం (1980)

ఇంగ్లండ్ 58/0 vs భారతదేశం (2012)

భారత్ 51/2 vs ఇంగ్లాండ్ (1984)

ఆస్ట్రేలియా 47/0 vs భారతదేశం (2001)

రెండు జట్ల ప్లేయింగ్-11..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.

న్యూజిలాండ్: టామ్ లాథమ్ (కెప్టెన్), డ్వేన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్క్.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..