Virat Kohli: యూఏఈలో జరిగిన ప్రపంచ కప్ సందర్భంగా టీ20ఐ లలో చివరిసారిగా టీమ్ ఇండియాకు నాయకత్వం వహించిన విరాట్ కోహ్లీ, సూపర్ 12 నుంచే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. టోర్నమెంట్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో టోర్నెమెంట్‌లో ముందుకుసాగే అవకాశాలను మరింత కఠినంగా చేసుకుంది. అయితే కేవలం టాస్ ఓడిపోవడంతోనే మ్యాచ్ ఓడిపోయారు. భారత జట్టు పాకిస్తాన్ టీంతో 10 వికెట్ల తేడాతో, న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో భారీ ఓటములు చవిచూసింది. దీంతో చివరి మూడు మ్యాచులు(ఆఫ్ఘనిస్తాన్, స్కాట్లాండ్, నమీబియాపై) గెలిచినా 2021 ఎడిషన్ టీ20 ప్రపంచ కప్ నుంచి నిష్ర్కమించింది.
టోర్నమెంట్ అంతటా వచ్చిన ఫలితాల్లో టాస్‌లు కీలక పాత్ర పోషించాయని నమీబియాతో జరిగిన చివరి మ్యాచ్‌కు ముందు టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ తెలిపాడు. అయితే టాస్ ఓడిపోవడాన్ని సాకుగా ఉపయోగించలేమని కోహ్లీ పేర్కొన్నాడు.
“టాస్ గురించి వాదనకు దిగే వాళ్లం కాదు. టాస్ ఓడినా లేదా గెలిచినా ప్రదర్శనలు బాగా ఇవ్వాలి” అని భారత కెప్టెన్ పేర్కొన్నాడు. “మేం మొదటి రెండు గేమ్‌లలో తగినంత ధైర్యంగా బరిలోకి దిగలేదు. దాంతో మేం చాలా బాధపడ్డాం. ఈ రెండు మ్యాచులు ఓడిపోయాక మా బృందం తర్వాత దశలోకి వెళ్ళడం సంక్లిష్టంగా మారింది” అని కోహ్లీ తెలిపాడు.
Also Read: Ravi Shastri Sign Off Speech: బరువెక్కిన హృదయంతో హెడ్ కోచ్ రవిశాస్త్రి చివరి సందేశం.. ఏమన్నాడంటే?